తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు అండ‌గా నిల‌వాలి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు మిచౌంగ్ తుపాన్  ప్రభావిత ప్రాంతాలలో జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా  పార్టీ శ్రేణులు స‌హాయ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములై..బాధితుల‌కు అండ‌గా నివాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఆదేశాలు అందాయి.

తుపాన్ కార‌ణంగా ప్రమాదం పొంచి ఉన్న చోట్ల ఎక్కడా  ప్రాణనష్టం వాటిల్లకుండా యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని.. అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆదేశిస్తూ..  ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష జరిపి ప్రత్యేకంగా ఉన్నతాధికారులను పరిశీలకులుగా పంపించడం జరిగింది.

తుపాన్ తీవ్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు మీ ప్రాంతంలోని అధికారులను సమన్వయం చేసుకుని  సహాయ కార్యక్రమాలలో ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించిన నాయకులను భాగస్వామ్యం చేస్తూ తుపాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు కావలసినవి అందేలా చూస్తూ వారికి అండగా నిలవాలని కేంద్ర కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్హులు జారీ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top