కోలాహలంగా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు 

 అమరావతి:రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉత్సాహంగా సాగుతున్నాయి.వైయస్‌ఆర్‌సీసీ అభిమానులు,కార్యకర్తలతో భారీ ర్యాలీలతో అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్తిగా అనంత వెంకట్రామిరెడ్డి,  తాడిపత్రిలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి , ధర్మవరంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంతపురం వైయస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా తలారి రంగయ్య. హిందూపురం వైయస్‌ఆర్‌సీపీ  లోక్‌సభ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, మడకశిరలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డా.తిప్పేస్వామి, జమ్మలమడుగులో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి, ఆలూరు వైయస్‌ఆర్‌సీపీ  అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, చీరాల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్, చంద్రగిరి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, గిద్దలూరు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు, అమలాపురం వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ అభ్యర్థిగా చింతా అనురాధ నామినేషన్‌ దాఖలు చేశారు.

Back to Top