బీసీ గర్జనతో బీసీలకు సువర్ణ అధ్యాయం..

జయహో బీసీ అనే అర్హత చంద్రబాబుకు లేదు..

బలహీనవర్గాల పట్ల టీడీపీకి  చిత్తశుద్ధి లేదు

వైయస్‌ఆర్‌సీపీ నేతలు జంగా కృష్ణమూర్తి,జోగి రమేష్‌

విజయవాడ: రేపు ఏలూరులో  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుందని వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు.సభలో వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారని తెలిపారు.రేపు జరగబోయే బీసీ గర్జనను రాష్ట్రంలో ఉన్న బీసీవర్గాలకు చెందిన మేధావులు,కుల సంఘ పెద్దలు,విద్యార్థులు,మహిళలు అందరూ కూడా నిశితంగా పరిశిలించాలని కోరారు.

–బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: జోగి రమేష్‌..

బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అంటూ సభలు పెట్టే అర్హత లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ విమర్శించారు.ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు సబ్‌ప్లాన్‌ ద్వారా బీసీలకు నిధులు కేటాయిస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. 50 వేల కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం 15వేల కోట్ల రూపాయలు ఇచ్చి...35 వేల కోట్లు బాకీ పడ్డారని ధ్వజమెత్తారు. బీసీలను ఓట్ల రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప..బీసీల పిల్లలను చదివించాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అంటూ  చంద్రబాబును ప్రశ్నించారు. 2004లో వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  తర్వాత 26 లక్షల మంది విద్యార్థులు  ఉన్నత చదువులు చదువుకున్నారన్నారు. ఇంజనీర్లు,డాక్టర్లు,ఐటి రంగాల్లో  పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తుచేశారు. గతంలో తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలించిన చంద్రబాబు హయాంలో బలహీనవర్గాల పిల్లలను ఉచితంగా చదివించాలనే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.

 

Back to Top