బేస్తవారిపేటలో వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య

కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పరామర్శ

ప్ర‌కాశం:  బేస్త‌వారిపేట‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త బ్ర‌హ్మ‌య్య దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కంభం మండ‌లం ద‌ర్గా గ్రామానికి చెందిన బ్ర‌హ్మ‌య్య‌ వైయ‌స్ఆర్‌సీపీలో చురుకైన కార్య‌క‌ర్త‌గా ఉన్నారు.  హత్యకు గురైన యువకుడు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కావడంతో సంఘటన స్థలాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప‌రిశీలించారు. భౌతిక‌కాయ‌న్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు.  మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పోలీసుల‌ను కోరారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని  నాగార్జున రెడ్డి భరోసా క‌ల్పించారు. 

Back to Top