ఈనెల 20న ‘వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం’

రెండో సంవత్సరం రూ.24 వేల సాయం అందుకోనున్న చేనేత కార్మికులు

తాడేపల్లి: ‘వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరమగ్గాలను ఆధునీకరించుకునేందుకు చేనేత కార్మికులకు రెండవ ఏడాది కూడా వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందనున్నారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ చేయనున్నారు. జూన్‌ 17వ తేదీన వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని రెండవ సంవత్సరం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనా.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల వల్ల ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.

తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేనేత కార్మికుల కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌.. నేతన్నల కష్టాలను తీర్చేందుకు ఏటా రూ.24 వేల సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గతేడాది డిసెంబర్‌ 21వ తేదీ తన పుట్టిన రోజునే ధ‌ర్మ‌వ‌రంలో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి రూ.24 సాయాన్ని మరమగ్గం కలిగిన ప్రతీ నేతన్నకు అందించారు. ఈ ఏడాది కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ముందుగా ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పించారు.  

 

Back to Top