వైయస్‌ఆర్‌ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ భారం,  మందగమనం లాంటి వరుస కష్టాలతో ఆర్థికంగా కుంగిపోయిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘వైయస్‌ఆర్‌ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైయస్‌ఆర్‌ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Read Also: ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Back to Top