మ‌హానేత వైయ‌స్ఆర్‌కు ఘ‌న నివాళులు

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ వర్ధంతి కార్య‌క్ర‌మం

వైయ‌స్ఆర్ సేవ‌ల‌ను కొనియాడిన మంత్రులు, పార్టీ నేత‌లు

తాడేప‌ల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో  మ‌హానేత‌కు ఘనంగా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి, పూల‌మాల‌లు వేసి పార్టీ నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రులు ధ‌ర్నాన కృష్ణ‌దాస్‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, కుర‌సాల క‌న్న‌బాబు, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, గుమ్మ‌నూరు జ‌య‌రాం,  బొత్స స‌త్య‌నారాయ‌ణ, మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వైయ‌స్ఆర్ స్ఫూర్తితో ప‌ని చేద్దాం..: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అకాల మ‌ర‌ణం పొంది స‌రిగ్గా 12 ఏళ్లు, 2009, సెప్టెంబ‌ర్‌2న హెలికాప్ట‌ర్లో బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ 3వ తేదీ వ‌ర‌కు క‌నిపించ‌క‌పోవ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు, అభిమానులు నిద్రాహారాలు మాని ఎదురుచూశారు.  ఆ వారం రోజులు ఇంట్లో వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లుగా ప్ర‌జ‌లు బాధ‌ప‌డ్డారు. ఓ వ్యక్తి వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేస్తూ..కోట్లాది మంది హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోవ‌డం అసాధ్య‌మ‌ని వైయ‌స్ఆర్ నిరూపించారు. స్వార్థం పెరుగుతున్న రోజుల్లో..సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో..మ‌న ప‌క్క‌నే ఏం జ‌రుగుతుందో ప‌ట్టించుకోని రోజుల్లో ..,చిన్న విత్తనంగా మొద‌లై..రూపాయి డాక్ట‌ర్‌గా పేద‌ల‌కు ఎంత ద‌గ్గ‌ర‌య్యారో..కాంగ్రెస్ పార్టీ వందేళ్ల చ‌రిత్ర ఉన్న పార్టీలోనే త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకున్న నాయ‌కుడు వైయ‌స్ఆర్‌. త‌న‌ను న‌మ్ముకున్న వారికి విలువ ఇస్తార‌న్న పేరు సంపాదించుకున్నారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని..అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చిన మ‌హానుభావుడు వైయ‌స్ఆర్‌. విద్య‌, వైద్యం, నీరు, ఇల్లు, జీవితానికి భ‌ద్ర‌త క‌ల్పించిన నాయ‌కుడు మ‌హానేత వైయ‌స్ఆర్‌. ఆయ‌న పాల‌న‌, వ్య‌క్తిత్వం ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌ను త‌యారు చేసింది. ఇలాంటివి చ‌రిత్ర‌లో అరుదుగా జ‌రుగుతుంటాయి. అంద‌రికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ..ఆయ‌న కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్ ప‌దేళ్ల పాటు ఒంట‌రి పోరాటం చేస్తూ..కార్య‌క‌ర్త‌లే బ‌లంగా ఎదిగారు. అన్ని ర‌కాల వ‌ర్గాల మీద‌, శ‌క్తుల‌పై పోరాటం సాగిస్తూ గ‌తేడాది 2019లో వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం ఒక చ‌రిత్ర‌. వైయ‌స్ఆర్ జీవితం ఒక స్ఫూర్తిదాయ‌క‌మైతే..ఆ స్ఫూర్తి నుంచి వ‌చ్చిన ఒక పార్టీని వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు తీసుకెళ్లారు. మ‌హానేత‌కు మ‌ర‌ణం లేదు. మ‌నంద‌రం ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి. ఆయ‌న ఆశ‌యాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ల‌క్ష‌లాది మంది, కోట్లాది మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి దేశంలోనే ఒక అగ్రగామీ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. వైయ‌స్ఆర్ గుర్తుగా అంద‌రి ఇ ళ్ల‌లో ఆయ‌న ఫోటో పెట్టుకున్నారు. ఏదైతే ఈ రాష్ట్రానికి అవ‌స‌ర‌మో..దాన్ని  వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు తీసుకెళ్తుంది. మ‌న అవ‌స‌రం కాదు..పార్టీ అవ‌స‌రం కాదు..ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ గుర్తించారు కాబ‌ట్టే..ప్ర‌జ‌లు ఆయ‌న్ను గుండెల్లో పెట్టుకున్నారు. అంద‌రం కూడా ఒక ప్ర‌తిజ్ఞ చేయాల్సిన దినం ఇది. ఆయ‌న స్పూర్తితో పార్టీని మ‌రింత ముందుకు తీసుకెళ్దామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top