దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు

వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా: చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశాడా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అని విమర్శించారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు  అని ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వ్యక్తి దేశంలో మరొకరు ఉండరన్నారు. రాజీనామా చేయమని అవతలి వారికి చెప్పే ముందు మనం పాటించాలని, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని నిలదీశారు. రాజీనామాలను వెంట్రుకతో సమానంగా విసిరేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top