చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా..

వైయ‌స్ఆర్ సీపీ నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: చంద్రబాబు పెత్తందారుల ప్రతినిధి అని సీఎం వైయ‌స్‌ జగన్ ఇన్నాళ్లు అంటున్న మాట‌ను బాబు నిజం చేసి చూపించారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. బాబు, ఆయ‌న కూట‌మి పార్టీలు డ‌బ్బున్న వాళ్ల‌కు, ఎన్నారైల‌కు టికెట్లిచ్చాయ‌న్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబును నిల‌దీస్తూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
 
`చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. 2019 ఎన్నికల్లో మీరు అధికారంలో ఉండి పోటీ చేశారు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు. మీకు కాపలా కాసే పార్టీలు విడివిడిగా పోటీ చేసినా ఆయా పార్టీల బి-ఫారాలు మీరు చెప్పిన వాళ్లకే అందాయి. ఇంత చేస్తే మీరు గెలిచింది 23 అసెంబ్లీ స్థానాలు. 3 లోక్‌సభ సీట్లు. ఈసారి బహిరంగంగా పొత్తు కట్టారు సరే. ప్రజలను కన్విన్స్ చేయడానికి అప్పుడు ఇవ్వలేనివి ఇప్పుడేమి ఇస్తారు?`

`తాను పేదల పక్షమైతే.. చంద్రబాబు పెత్తందారుల ప్రతినిధి అని సిఎం జగన్ గారు ఇన్నాళ్లు అంటున్నది నిజం చేసి చూపించారు బాబు. అన్నట్టుగానే బాబు, ఆయన కూటమి పార్టీలు డబ్బున్న వాళ్లకు, ఎన్నారైలకు టికెట్లిచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల్లో కనీసం సొంత ఇల్లు లేనివారు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ అని మీరు చులకన చేసి మాట్లాడిన శింగనమల వీరాంజనేయులు అందులో ఒకరు. ఇది క్లాస్ వార్ కాక మరేమిటి బాబూ?`

Back to Top