చంద్రబాబూ.. డ్రామాలు కట్టిపెట్టు

వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు నారాయణమూర్తి  

తాడేప‌ల్లి: పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో చంద్ర‌బాబు డ్రామాలు క‌ట్టి పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు నారాయణమూర్తి  హెచ్చ‌రించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నారాయ‌ణ‌మూర్తి మీడియాతో మాట్లాడారు.

నారాయ‌ణ‌మూర్తి ఏమ‌న్నారంటే..

  • ఎన్నిలలో టిడిపి కూటమికి లబ్ది చేకూర్చేందుకు పచ్చమీడియాలో నిత్యం,అసత్యాలు అబద్దాలు రాస్తున్నారు.
  • పచ్చమీడియా పత్రికలు కూటమికి కరపత్రాలుగా మారడమే కాక నిత్యం జగన్ గారిపై విషం చిమ్ముతున్నాయి.
  • పచ్చమీడియాలో రాయడం వాటిని పవన్ కల్యాణ్, చంద్రబాబులు సభలలో మాట్లాడటం చేస్తున్నారు. 
  • చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూల్స్ ముసివేయాలని జిఓ ఇచ్చిన విషయం నిజం కాదా
  • వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక జగన్ గారు తీసుకున్న నాడు-నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు.
  • -కార్పోరేట్ స్కూల్స్ లో పోటీపడేరీతిలో నేడు ప్రభుత్వ స్కూల్స్ తయారయ్యాయి.
  • వైద్య,ఆరోగ్యంలో ప్రజలకు భరోసా కల్పంచేందుకు జగన్ గారు ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచారు.
  • 3 వేలకు పైగా అంశాలలో ట్రీట్ మెంట్ ఇచ్చేవిధంగా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దారు.కొన్ని సందర్భాలలో చికిత్స తర్వాత ఉపాధి కింద కొన్ని రోజుల పాటు వారికి కాంపెన్ సేట్ చేస్తున్నారు.
  • వైద్య,ఆరోగ్యరంగం బలోపేతం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ వచ్చాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మితమవుతున్నాయి.
  • పెన్షన్స్ విషయంలో కలెక్టర్స్ లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు.
  • వాలంటీర్ల ద్వారా సజావుగా సాగుతున్న పెన్సన్ల పంపిణి ప్రక్రియ చంద్రబాబు మనుషుల ఫిర్యాదుతో పెద్ద సమస్యగా మారింది.
  • గత నెలలో 38 మంది వృద్ధుల మరణానికి కారణం చంద్రబాబు ఆయన తరపు మనుషులే కారణం
  • పెన్షన్స్ పంపిణి అడ్డుకుంది చంద్రబాబు..మళ్ళీ ఎన్నికల కమిషన్ కలుస్తారు. అర్జీలు ఇస్తారు.
  • వృద్ధుల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది.
  •  వృద్ధుల ప్రాణాలను కాపాడండి వాళ్ళ చావుకి  కారణం కావద్దు.చంద్రబాబు తన వైఖరి విడనాడాలి
Back to Top