తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల 30వ తేదీ (మంగళవారం)షెడ్యూల్ ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. సీఎం వైయస్ జగన్ 30 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండెపి నియోజకవర్గం టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్ లో జరిగే సభ లో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.