అమరావతి: న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పనికిరాని చర్చలు నిర్వహిస్తున్న రెండు ఛానళ్లపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి కోరారు. తీర్పులు ఎలా ఇవ్వాలో కూడా కొన్ని ఛానళ్లు దిశానిర్దేశం చేస్తున్నాయని, న్యాయవ్యవస్థను అపహాస్యం చేసేలా చర్చా కార్యక్రమాలు ఉన్నాయని మండిపడ్డారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు వ్యవస్థలను ప్రభావితం చేసేలా టీడీపీ కుట్రలు చేస్తోందని మనోహర్‌రెడ్డి విమర్శించారు. ప్రైమ్ న్యూస్‌లో మార్నింగ్, ఈవ్‌నింగ్ కొంతమంది న్యాయవాదులను, రెగ్యులర్‌గా ప్యానలిస్టులను కూర్చోబెట్టుకొని మీడియా ఛానళ్లు విషప్రచారం చేస్తున్నాయన్నారు. న్యాయస్థానాలు ఎలా తీర్పు ఇవ్వాలి, ఎవరు ముద్దాయి, ఎవరికి శిక్ష వేయాలని, విచారణ ఏ రకంగా కొనసాగాలనేది టీవీ చర్చల్లో డిసైడ్ చేస్తున్నారన్నారు. ఇటీవల వీరి తంతు తారాస్థాయికి చేరిన తరువాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా తన వ్యక్తిగత ప్రతిష్టపై దాడి జరుగుతుందని తీర్పులో ఉదహరించి రెండు చానళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారని మనోహర్‌రెడ్డి గుర్తుచేశారు. రెండు ఛానళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష విధించాలని వైయస్‌ఆర్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడం, వారికి అనుకూలమైన తీర్పురాకపోతే టీవీ చర్చలో జరిగిన పద్ధతుల్లో విచారణ జరగలేదనో, వారి ప్రయోజనాలు నెరవేరలేదనో.. న్యాయవ్యవస్థను ప్రభావితం చేసి తద్వారా వారికి అనుకూలంగా తీర్పురావాలని భయపెట్టేరీతిలో ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్ సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహన్‌రెడ్డి అన్నారు.