గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలి

ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌తో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. శ్రీ‌కాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా సీతంరాజుసుధాకర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ చేస్తున్నారని తెలిపారు. వీరి గెలుపున‌కు అంద‌రూ స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని సూచించారు.   

Back to Top