రాష్ట్ర‌వ్యాప్తంగా  రెండో రోజు జ‌నాగ్ర‌హ దీక్ష‌లు

బాబు క్షమాపణ చెప్పాల్సిందే

అమ‌రావ‌తి:  తెలుగుదేశం పార్టీ నేతల బూతు పురాణాన్ని నిరసిస్తూ.. అందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ  ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర‌వారం పార్టీ శ్రేణులు  రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు శుక్ర‌వారం జనాగ్రహ దీక్షలు కొన‌సాగిస్తున్నారు. టీడీపీ నాయ కుడు పట్టాభి ఉపయోగించిన బూతు పదాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని నినదిస్తున్నారు. కృష్ణాజిల్లా లోని పార్టీ ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవ ర్గాల్లో దీక్షలు చేపట్టారు. పట్టాభి బూతు వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, పలు మండల కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో దీక్షలు జ‌రుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రజాగ్రహం పెల్లుబికింది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుల తీరుపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తింది.  జనాగ్రహ దీక్షలతో ప్రకాశం జిల్లా హోరెత్తిపోయింది. రాజకీయ విషక్రీడకు చంద్రబాబు తెరతీస్తున్నారని ధ్వజ మెత్తారు. 
చంద్రబాబు కుట్రను శ్రీకాకుళం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఎండగట్టాయి. విజయనగరం జిల్లాలో జరిగిన దీక్షల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ సంఘీభావం తెలిపారు. టీడీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకు నేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అరాచకా లు సృష్టిస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి ఓర్వలేక రెచ్చగొట్టడమే టీడీపీ అజెండాగా మారిందని విశాఖ జిల్లా నేతలు ఆరోపించారు. దద్దమ్మగా మారిన లోకేశ్‌ నాయకత్వాన్ని పార్టీ నేతలు ఒప్పుకోకుండా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ని తీసుకు రావాలని డిమాండ్‌ చేస్తుంటే చంద్రబాబు అస హనానికి  గురవుతున్నారని ఎద్దేవా చేశారు.  

Back to Top