చంద్రబాబు అబద్ధపు హామీలకు మోసపోవద్దు

వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టింది

సొంత జిల్లాను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు

మేనిఫెస్టో  పవిత్ర గ్రంథం లాంటింది

వైయస్‌ జగన్‌ ప్రతి హామీని నెరవేరుస్తారు

శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

చిత్తూరు జిల్లా: గత ఎన్నికల్లో 2014 చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో ఆరువందలకు పైగా హామీలిచ్చి  ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను మాయం చేశారని వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలను జతచేసి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే...

ఎవరైనా సొంత జిల్లాను ప్రేమిస్తారు.కానీ చంద్రబాబు సొంత జిల్లాను కూడా పట్టించుకోలేదు.గాలేరు–నగరి ప్రాజెక్టులో 80 శాతం పనులు వైయస్‌ఆర్‌ పూర్తిచేశారు. పెండింగ్‌ పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోతున్నారు. ఇసుక,మట్టి,బొగ్గు,భూములు అమ్ముకుంటున్నారు. ఏదీ కూడా వదిలిపెట్టడంలేదు. తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా మోదీ,చంద్రబాబు,పవన్‌లు ప్రత్యేకహోదా ఇస్తామని తెలిపారు.చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారు.ఓటుకు నోట్లు కేసులో పారిపోయి ఆంధ్రాకు వచ్చారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి  చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు.వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టింది.పది రోజుల  ముందే మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు..వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేసేవరుకూ టీడీపీ విడుదల చేయలేదు.మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథం లాంటిందని,ఇచ్చిన ప్రతి హామీని మనసా,వాచ,కర్మేనా అమలు చేయాలని వైయస్‌ జగన్‌  తెలిపారు.

చంద్రబాబు 2014లో టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఒక బుక్‌ విడుదల చేస్తారు.650 వాగ్ధానాలు, ఐదు సంతకాలు అంటూ ప్రజలను మోసం చేశాడు.ఒకటి కూడా అమలు చేయలేదు. ప్రజలు అడుగుతారమో అని భయపడి..వెబ్‌సైట్‌లో నుంచి ఆ మేనిఫెస్టోను తొలగించారు.చంద్రబాబు 2019లో కొత్త బుక్‌ తీసుకొచ్చి అబద్ధాలు చెబుతున్నారు.రైతులకు భరోసాగా పెట్టుబడిసాయం ప్రతి సంవత్సరం మే నెలలో 12,500 రూపాయాలు ఇస్తానని వైయస్‌ జగన్‌ చెప్పారు.వైయస్‌ జగన్‌ చెప్పిన తర్వాతే చంద్రబాబు అన్నదాత సుఖీభవ పెట్టారు.వైయస్‌ జగన్‌ చెప్పిన తర్వాతే చంద్రబాబుకు రైతులు గుర్తుకువచ్చారా..వైయస్‌ జగన్‌ రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తానని చెప్పారు.చంద్రబాబు కూడా రోడ్డు ట్యాక్స్‌ రద్దుచేస్తారంటా..జగన్‌బాబు చెప్పిన తర్వాతే చంద్రబాబుకు రోడ్డు ట్యాక్స్‌ గుర్తుకువచ్చిందా..డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 87వేల కోట్లు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు..చేశాడా అని అడుగుతున్నా..వడ్డీలేని రుణాలు రైతులకు దొరకడంలేదు.

చంద్రబాబు పసుపు–కుంకమ అంటూ పెద్దన్నయ్య నంటూ చంద్రబాబు  చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.ఈ ఐదు సంవత్సరాల్లో వడ్డీ కట్టాడా..వడ్డీని ఎగ్గొటేశాడు.అది కూడా మీపైనే భారం పడింది. నిరుద్యోగులకు 2 వేల భృతి ఇస్తానన్నాడు ఇవ్వలేదు. రెండు లక్షలకు పైగా ఖాళీపోస్టులు ఉన్నా కూడా భర్తీచేయలేదు. నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నాడు. ఎవరికి వచ్చాయి...ఉద్యోగాలు మీకు వచ్చాయా..అని అడుగుతున్నా. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ల  క్యాలెండర్‌ జారీ చేస్తాం. మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం.

గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం.పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా జగన్‌బాబు ఇస్తారు.అవ్వ,తాతలకు మూడువేల పెన్షన్‌ పెంచుకుంటూ పోతారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేస్తాం. పాత పెన్షన్‌  విధానమే ఉంటుంది.పీఆర్సీ అమలులో ఉంటుంది. 27 శాతం ఐఆర్‌ఎస్‌ ఇస్తాం.ç Üమాన పనికి సమాన వేతనం ఇచ్చి కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తాం.భూ యాజమానులకు ఎలాంటి కష్టం కలిగించకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేవిధంగా ప్రతి పథకం కూడా వర్తింపచేస్తాం.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటాం.మన రాష్ట్రంలో 25 మందిని ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేకహోదా సాధించుకుందాం..చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు.నేడు రాహుల్‌తో కలిసిన చంద్రబాబు.. బీజేపీ,కేసీఆర్‌తో జగన్‌ కలిశాడంటూ దుష్ఫ్రచారం చేస్తున్నాడు. వైయస్‌జగన్‌ ఎన్నడూ బీజేపీ,కేసీఆర్,కాంగ్రెస్‌తో లేడు.కేసీఆర్‌కు,మన రాష్ట్రానికి ఏమిటి  సంబంధం అన్ని అడుగుతున్నా..కేసీఆర్,మనం కలిసి పోటి చేస్తున్నామా..వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటి చేస్తారు.వైయస్‌ కుటుంబం ఎప్పూడూ ప్రజలకు రుణపడి ఉంటుంది.వైయస్‌ జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రజల ప్రేమను మరిచిపోలేం.పాదయాత్రలో ప్రజల కష్టాలు జగన్‌ చూశారు.కష్టాల్లో ఉన్నవారికి నేను ఉన్నాను అని జగన్‌ భరోసా ఇచ్చారు.నా బిడ్డ పెద్ద గండం నుంచి బయటపడ్డారంటే ప్రజల ప్రేమవల్లేనే.ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైయస్‌ జగన్‌ను సీఎం చేయాలని కోరారు.

 

 

Back to Top