చంద్రబాబు మోసగాడు

విలువలు,విశ్వసనీయతకు పట్టం కట్టండి

సొంత జిల్లాకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు

అధికారంలోకి రాగానే విజయ డెయిరీని తెరిపిస్తాం

ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం..

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌ఆర్‌దే.. 

పూతలపట్టు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

చిత్తూరు జిల్లా:చంద్రబాబుకు మళ్లీ ఓటు వేసి మోసపోవద్దని వైయస్‌ విజయమ్మ అన్నారు.650 వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక హామీ కూడా నెర్చవేర్చలేదన్నారు.పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు..

ప్రసంగం ఆమె మాటల్లోనే..

ఎన్నికలు రానే వచ్చేశాయి.వైయస్‌ఆర్‌ ఒకసారి గుర్తుతెచ్చుకోమని అడుగుతున్నా..ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు గుర్తుచేసుకోమంటున్నా..నేడు ధర్మానికి,అధర్మానికి మధ్య యద్ధం జరుగుతుంది.విలువలకు,విశ్వసనీయతకు ఓటు వేయాలని కోరుతున్నా..చంద్రబాబుకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు.వైయస్‌ఆర్‌కు,ప్రజలకు మధ్య 40 సంవత్సరాల అనుబంధం ఉంది.వైయస్‌ఆర్‌ 1978లో ఎమ్మెల్యే అయ్యారు.2004లో ముఖ్యమంత్రి అయ్యారు.వైయస్‌ఆర్‌ను మీ భుజస్కందాలపై మోసి ముఖ్యమంత్రిని చేసుకున్నారు.వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి,సంక్షేమంతో ముందుకు నడిపించారు.తన అభివృద్ధిని చూపించి 2009లో వైయస్‌ఆర్‌ అడిగారు. ప్రతి జిల్లాకు ఏ కావాలనేది వైయస్‌ఆర్‌ ఆలోచన చేశారు.అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు.వెలుగొండ, గాలేరునగరి,హాంద్రీనీవా తీసుకొచ్చి లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని కల కన్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో పెన్షన్‌ను 71 లక్షల  మందికి ఇచ్చారు. పేదవారికి కార్పొరేట్‌ అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు.

పేదవారి పిల్లలను ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. ముస్లిలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వైయస్‌ఆర్‌ ప్రభుత్వం శాచురేషన్‌ విధానంలో కుల,మతా,పార్టీలు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఒకపైసా కూడా పన్ను పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇది ప్రపంచంలోనే రికార్డు. రచ్చబండ కోసం చిత్తూరు జిల్లాకు వస్తున్నప్పుడే వైయస్‌ఆర్‌ ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చివరి క్షణం దాకా  ఆలోచన చేశారు.వైయస్‌ఆర్‌ మరణంతో కొన్ని వందల మంది గుండెలు ఆగిపోయాయి.చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలని వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని ప్రజలు ఎంతో ఆదరించారు.వైయస్‌ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర  చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేశారు.కాంగ్రెస్,టీడీపీలు అన్ని రకాలుగా వైయస్‌ జగన్‌పై కుట్రలు చేసి కష్టాలు పెట్టారు.వైయస్‌ జగన్‌కు పొమ్మనలేక పొగబెట్టారు.

వైయస్‌ జగన్‌ను జైలుకు కూడా పంపించారు. మా వెంట ఉన్నది ప్రజలే..వైయస్‌ఆర్‌ బతికుండగా నేను ఎన్నడూ బయటకు రాలేదు.వైయస్‌ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని గెలిపించుకోవడానికి బయటకురావాల్సి వచ్చింది.అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.సిబిఐ,ఈడి దాడులు చేశారు. ఆస్తులను అటాచ్‌చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి రోడ్డుకిడ్చారు. వైయస్‌ఆర్‌ వల్ల పైకి వచ్చిన వారు కష్టకాలంలో మా వెంటలేరు. అలాంటి సమయంలో మా కుటుంబానికి,వైయస్‌ జగన్‌కు తోడు ప్రజలు ఉన్నారు.ప్రజల రుణం ఎప్పటికి తీర్చుకోలేం.తొమ్మిది సంవత్సరాలుగా వైయస్‌ జగన్‌ నిత్యం ప్రజలు కోసమే పోరాటం చేస్తున్నారు.పాదయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ ప్రజల బాధలు విన్నారు.ప్రజలు కష్టాలు చూశారు.ప్రజలకు అండగా వైయస్‌ జగన్‌ ఉంటారు.వైయస్‌ఆర్‌ మరణంతో అన్ని  ప్రాంతాల్లోనూ చాలా మంది చనిపోయారు.వైయస్‌ఆర్‌కు కుల,మత,ప్రాంత బేధాలు లేవు.చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరుకు ఏంచేశాడు.సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేదు.ప్రభుత్వమే దళారీ పనిచేస్తోంది. ఈ జిల్లాలో 15వేల ఎకరాలు మామిడిని పండిస్తారు. మామిడికి గిట్టుబాటు ధర కూడా లభించడంలేదు.వైయస్‌ఆర్‌ హయాంలో ఉన్న గిట్టుబాటు ధరలు చంద్రబాబు హయాంలో లేవు.ఎన్నో సంవత్సరాలుగా లాభాలతో విజయ డెయిరీ నడిచేది.టీటీడీకి నెయ్యి ఇక్కడే నుంచే వెళ్ళేది.

చంద్రబాబు తన హెరిటేజ్‌ లాభాల కోసం విజయడెయిరీని మూయించివేశాడు.హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ ప్రారంభించి సుమారు 5వేల కోట్ల ఖర్చుపెట్టారు.80 శాతం పనులను పూర్తిచేశారు.చంద్రబాబు వచ్చేటప్పటికి కేవలం 250 కోట్లు పని మాత్రమే ఉంటే..ఆ పని కూడా  పూర్తిచేయకుండా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు.గాలేరినగరి ప్రాజెక్టును కూడా వైయస్‌ఆర్‌ మొదలుపెట్టి  పూర్తిచేశారు.కేవలం రెండు,మూడు శాతం మాత్రమే మిగిలి వుంది.  మిగిలిన శాతాన్ని కూడా చంద్రబాబు పూర్తిచేయలేదు.చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ హయాంలో ఎస్సీ,ఎస్టీలకు 32 ఎకరాలు ఇచ్చారు.నేడు  చంద్రబాబు ఒక ఎకరం అయినా ఇచ్చాడా అని అడుగుతున్నా..రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ 119 కోట్లు రావాల్సి ఉంది. అది ఇచ్చారా అని అడుగుతున్నా..చంద్రబాబు మోసాలు చూస్తే.. ఇసుక,మట్టి,బొగ్గు అని దోచుకుంటున్నారు.రాజధాని భూములు,దళిత,ఆలయ భూములను అమ్ముకుని తింటున్నారు.12,500 కోట్ల రూపాయల ఇసుకను దోచేశారు.జాతీయ హరితా కమిటీ ఏపీ ప్రభుత్వానికి 100 కోట్లు రూపాయలు జరిమానా విధించింది.ఇంతకంటే సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా.650 వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఒకటైనా అమలు చేశాడు అని అడుగుతున్నా..రైతులకు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా..వడ్డీరుణాలు కూడా రావడం లేదు.ప్రతి ఏటా 12,500 రైతుల చేతిలో పెడతానని వైయస్‌ జగన్‌ ప్రకటిస్తే..నేడు చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటున్నాడు.నమ్మవచ్చా అని అడుగుతున్నా..నేడు మీ భవిష్యత్‌..మా భరోసా అంటున్నాడు నమ్మవచ్చా.. ఎల్‌కేజీ నుంచి పీజీదాకా ఉచిత చదువులు చదివిస్తారు.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. 1000 రూపాయలు దాటిని ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం.

దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం. వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. పంట బీమా చేస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.  గిట్టుబాటు ధరలకు ముందే గ్యారంటీ ఇస్తాంప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం ప్రతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ల  క్యాలెండర్‌ జారీ చేస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం.

గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు టాక్స్‌ రద్దుచేస్తాం.వృద్ధాప్య పింఛను రూ.2వేల నుంచి 3వేలు పెంచుకుంటూ పోతాం. చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు.నేడు రాహుల్‌తో కలిసిన చంద్రబాబు..  బీజేపీ,కేసీఆర్‌తో జగన్‌ కలిశాడంటూ దుష్ఫ్రచారం చేస్తున్నాడు. వైయస్‌జగన్‌ ఎన్నడూ బీజేపీ,కేసీఆర్,కాంగ్రెస్‌తో లేడు.కేసీఆర్‌కు,మన రాష్ట్రానికి ఏమిటి  సంబంధం అన్ని అడుగుతున్నా..కేసీఆర్,మనం కలిసి పోటి చేస్తున్నామా..వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటి చేస్తారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం.షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం..చెరుకురైతులను ఆదుకుంటాం.హాంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. ప్రతి ఎకరానికి నీరు ఇస్తాం.విజయ డెయిరీని తెరిపిస్తాం.సహకార డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్‌కు 4 రూపాయలు బోనస్‌ ఇస్తాం. పూతలపాటు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.బాబు,ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప నిలబడ్డారు.ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా..

 

 

 

 

 

 

 

Attachments area

Back to Top