ప్రత్యేక హోదా రావాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలి

 కలిదిండి సభలో వైయస్‌ షర్మిల

రుణమాఫీ పేరుతో రైతులను దగా చేసిన వ్యక్తి చంద్రబాబు

మొత్తం రుణమాఫీ అంటూ డ్వాక్రా మహిళలను బాబు వంచించారు

పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు

కమీషన్ల కోసం పోలవరం అంచనాలు పెంచేశారు
ప్ర

త్యేక హోదా ఏపీకి ఊపిరిలాంటిది

మాకు ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలు 

వైయస్‌ఆర్‌సీపీ సింగిల్‌గానే పోటీ చేస్తోంది

ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యండి

కైకలూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైయస్‌ షర్మిల అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. తండ్రీకొడుకులు కలిసి ఏపీని లూటీ చేశారని మండిపడ్డారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతే రాజు అవుతారని చెప్పారు. కైకలూరు ప్రజలకు  అన్యాయం జరుగకుండా చూస్తామని మాటిచ్చారు. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి సభలో వైయస్‌ షర్మిల మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ప

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్లు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేదన్నారు. ప్రతి పేదవిద్యార్థి తనకేమి ఢోకాలేదని ధీమా చదువుకున్నారన్నారు. ఉద్యోగం తెచ్చుకోగలను అనే భరోసా ఉండేది. ఉచితంగా కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేవాళ్లమని భరోసా ఉండేది. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని కల కన్నారు. ప్రతి పేదకు ఇల్లు ఉండాలని ఆశపడ్డారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా చార్జీ పెంచలేదు. పెంచకుండానే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. నీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ పార్టీ అని అడగలేదు. అన్ని వర్గాలకు మేలు చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని గర్వంగా చెబుతున్నాను. 

ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లు పరిపాలన చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. రైతులను వంచించారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తామన్నారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యింది. ఆ రుణంపై వడ్డీ పడింది. చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న పసుపు–కుంకుమ కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. చంద్రబాబు ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. మోసపోతారా? మళ్లీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. మొత్తం ఫీజు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులను తొలగించారు. చంద్రబాబుకు రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారా? ముఖ్యమంత్రి హోదాలో ఇలాగేనా చేసేది. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం రూ.60 వేల కోట్లకు అంచనాలు పెంచారు. పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి. ఈయన కమీషన్ల కోసం తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు వాగ్ధానం చేశారు. మాట నిలబెట్టుకునే వాడు అయితే ఈ పాటికి పోలవరం పూర్తి చేసేవాడు. అమరావతి, రాజధాని కట్టేస్తానని ప్రగల్భాలు పలికారు. మన రాజధాని ఎలా ఉంది. ఐదేళ్లలో ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి రూ.250 కోట్లు ఇచ్చామని చెబుతోంది. ఈయన మాత్రం ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. రోడ్డు వేయలేదు. అమ్మకు అన్నం పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అన్నాడట..చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది.  ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు. మళ్లీ ఐదేళ్లు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట. శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తారట. మన చెవిలో పూలు పెడతారట..నమ్ముతారా.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది. మీ కొడుకుకు ఏమైనా జాబు వచ్చిందా? చంద్రబాబు కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పుగారికి కనీసం జయంతికి, వర్ధింతికి తేడా తెలియదు. అఆలు కూడా రావు కానీ..అగ్రతాంబుళం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేని పప్పుకు ఏ అర్హత ఉందని, ఏం అనుభవం ఉందని మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా?. మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు. నోటిఫికెషన్లు లేవు. ఇప్పుడు ఈ దొంగ బాబు మీ భవిష్యత్తు– నా బాధ్యత అని చెప్పుకుంటున్నారు. ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? . పప్పు గారి బాధ్యతే ఆయన బాధ్యతానా? ఈ ఐదేళ్లు పప్పు కోసమే పని చేశారు. 40 ఏళ్లలో ఏపీ ఎంత అప్పు చేసిందో..ఈ ఐదేళ్లలో అంత అప్పు చేశారు. తండ్రి కొడుకు కలిసి ఏపీని లూటీ చేశారు. ప్రతి దాంట్లోనూ అవినీతే..లూటీ చేశారు. నమ్ముతారా? పొరపాటున కూడా ఈయన చేతుల్లో మన భవిష్యత్తు పెడితే నాశనం చేస్తారు. నారారూప రాక్షసులు వీరు.

అవునా? కాదా తమ్ముళ్లు..
మొన్న ఒక వీడియో చూపించారు. పొరపాటున కూడా టీడీపీకి ఓటు వేస్తే మన ఉరి మనమే తీసుకున్నట్లు అని పప్పుగారు ఆ వీడియోలో చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు. బంధుప్రితి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ తెలుగు దేశం పార్టీ అని లోకేష్‌ అన్నారు ..అవునా?కదా? తమ్ముళ్లు అన్నారు. అలా ఉన్నారు తండ్రి కొడుకులు. 

ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి లాంటిది. ఏపీకి చాలా అవసరం. బీజేపీ మనకు అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నిలదీయకుండా నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. ఇప్పుడేమో మనకు బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీకి పొత్తు అవసరమా? సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ఆర్‌సీపీ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్‌గా వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు, కాంగ్రెస్, జనసేన అందరూ కలిసి వస్తున్నారు. అయినా సరే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు మాకు ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసం జగనన్న చేయని పోరాటం లేదు. హోదా ఇంకా బతికే ఉందంటే జగనన్న చేసిన పోరాటాలే. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మనకు ప్రత్యేక హోదా రావాలి. దానికి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. మనకు బ్రహ్మాండమైన రాజధాని కావాలంటే, హైదరాబాద్‌ లాంటి రాజధాని కావాలంటే, రాజన్న రాజ్యం మాదిరిగా అభివృద్ధి చెందాలంటే జగన్‌ సీఎం కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో రైతే రాజు అవుతాడు. ప్రతి రైతుకు మే నెలలోనే పెట్టుబడి సాయం కింద రూ.12500 ఇస్తారు. నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తారు. రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. దురదృష్టవశాత్తు కరువు వస్తే నష్టపోకుండా రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేస్తారు. జగనన్న వస్తే పొదుపు రుణాలు ఎంత ఉన్నాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా మాఫీ చేసి మీ చేతికే నేరుగా ఇస్తారు. సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. విద్యార్థులు ఏ కోర్సు చేస్తారో ..ఆ కోర్సు చదవవచ్చు. పూర్తిగా ఫీజులన్నీ జగనన్నే చెల్లిస్తారు. ఎన్నిలక్షలైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది. ప్రతి విద్యార్థికి హాస్టల్‌ మెస్‌ చార్జీలకు రూ.20 వేలు, బిడ్డలను బడికి పంపినందుకు ఆ తల్లి ఖాతాలోకి రూ.15 వేలు ప్రతి ఏటాచెల్లిస్తారు. అవ్వతాతలకు పింఛన్‌ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తూ పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతారు.

మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే మాట తప్పని..మడమతిప్పని నేత జగనన్న రావాలి. అవినీతి పాలన పోవాలంటే..జగనన్న రావాలి. రైతు రాజు కావాలంటే జగనన్న రావాలి. పది తలల నారాసురుడు పోవాలంటే జగనన్న రావాలి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి రాజన్నపై ఉన్న అభిమానాన్ని చాటుకోండి. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. కలిదిండిలో ఎరువుల ఫ్యాక్టరీ వస్తుంది. అది వస్తే నష్టపోతారు. ఏ ఒక్కరికి అన్యాయం జరుగనివ్వం. మీ ప్రాంతంలో మీరు సంతోషంగా ఉండేలా జగనన్న పాలిస్తారు. పొరపాటున మళ్లీ చంద్రబాబు దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. అసమర్ధ ముఖ్యమంత్రి అవసరం లేదు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు(డీఎన్‌ఆర్‌)ను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించాలని నా మనవి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకోండి. మీకు సేవ చేసే అవకాశం ఒక్కసారి జగనన్నకు ఇవ్వండి. మీకు సేవ చేసిన రాజన్న బిడ్డగా ఇదే నా మనవి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలి.

 

Back to Top