పసుపు – కుంకుమ పథకం పచ్చి దగా

మళ్లీ చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు

ఎన్నికల సమయంలో భిక్షం వేసినట్లుగా డబ్బులిస్తున్నాడు

600ల వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు

ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వద్దు.. ఇంటికి పంపిద్దాం

ఓటు కోసం ఇంటికొచ్చే టీడీపీ నేతలను నిలదీయండి

జగనన్నకు ఒక్క అవకాశం ఇచ్చి రాజన్న పాలన తీసుకొద్దాం

వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల

పామ్రరు: పసుపు – కుంకుమ పేరుతో మహిళలను చంద్రబాబు మరోసారి వంచించాలని చూస్తున్నాడని, ఆ పథకం పచ్చి దగా. మహిళలు ఎవరూ చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దు అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. చంద్రబాబు వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని, రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచాడని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామ్రరు నియోజకవర్గంలో వైయస్‌ షర్మిల ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడుతూ.. 

వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నది ఐదేళ్లు మాత్రమే. కానీ ఐదేళ్లలోనే ఆంధ్రరాష్ట్రం ఎప్పుడూ చూడని అభివృద్ధి, సంక్షేమం చూసింది. నీది ఏ కులం, ఏ మతం అని అడగలేదు, ఆఖరికి పార్టీలు కూడా చూడలేదు. మన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు అది ఒక్క వైయస్‌ఆర్‌ మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం, 

ఇప్పుడున్నాడో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అన్ని ఈ ఐదేళ్లలో చూపించాడు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు. అదే మొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసం మొదటి సంతకానికైనా దిక్కుందా.. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. రైతులకు దగా చేశాడు చంద్రబాబు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు పసుపు – కుంకుమ అని ఇస్తున్న డబ్బు కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. భిక్షం ఇచ్చినట్లుగా ఎన్నికల సమయంలో ఇస్తున్నాడు. రుణమాఫీ చేయలేదు, కనీసం ఆ వడ్డీలకు సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మహిళలను చంద్రబాబు ఘోరంగా వంచించాడు. 

పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ అని చెప్పాడు. కానీ, పూర్తి ఫీజు రావడం లేదు. ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పుల పాలువుతున్నారని పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..? ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు పేదవాడు ఉచితంగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రుల లిస్టు తీసేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే మళ్లీ గవర్నమెంట్‌ ఆస్పత్రికే వెళ్లే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చాడు. చంద్రబాబు, ఆయన కుటుంబానికి జబ్బు వస్తే గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్తారా..? ఇది అమానుషం కాదా.. 

రూ. 15 వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు రూ. 60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానన్నాడు, చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటుంటే ఇవాల్టికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. 

చాలా అనుభవం ఉంది చంద్రబాబు రాజధాని కడతారని ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చాడు. కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చారంట.. కానీ, చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ, ఇంకో ఐదేళ్లు సమయం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట.. శ్రీకాకుళం జిల్లాను హైదరాబాద్‌ను చేస్తాడంట. మన చెవుల్లో పూలు, క్యాబేజీలు పెడతాడంట. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. సామాన్య ప్రజలకు ఎవరికైనా జాబు వచ్చిందా.. పప్పుకి జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేని పప్పుకు మాత్రం మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని మంత్రిని చేశారు. చంద్రబాబు కొడుకుకు మాత్రం మూడు ఉద్యోగాలు, సామాన్య ప్రజలకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు కూడా లేవు. ఇది న్యాయమేనా.. 

గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు సాధిస్తామన్నాడు చంద్రబాబు. ఎన్నికలు అయిపోయిన తరువాత హోదాను నీరుస్తూ ప్యాకేజీ అన్నాడు.. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ప్రత్యేక హోదా అంటున్నాడు. ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం. నాది రెండు నాలుకల ధోరణి అని చంద్రబాబు రెండు వేళ్లూ చూపిస్తుంటాడు. చంద్రబాబు మార్చే రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బందులు, రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు ఎన్నో చేశారు. ప్రతి జిల్లాలో యువభేరీ పెట్టి యువతను జాగృతం చేశారు. ఆఖరికి కేంద్రానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తరువాత నిరసనగా వారంతా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు దమ్ముంటే నిజం చెప్పాలి. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్యాకేజీ వద్దు హోదా అంటున్నారంటే దానికి కారణం వైయస్‌ జగన్‌. మళ్లీ మోసపోకండి. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదు. నాన్న అనేవారు చంద్రబాబు నెత్తి మీద ఒక శాపం ఉందంట. ఏ రోజు అయితే చంద్రబాబు నిజం చెబుతాడో.. ఆ రోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అయిపోతుందట. అందుకే నిజం చెప్పరు. 

చంద్రబాబు పౌరుషం, రోషం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదు. హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం లేకుండా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబే.. అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా.. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందంటే పిల్లి పులిఅయిపోతుందా.. పిల్లి పిల్లే.. పులి పులే. ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌ను విభేదించి వైయస్‌ జగన్‌ ఒక్కరే బయటకు వచ్చారు. అది పౌరుషం అంటే.. అది రోషం అంటే.. పిల్లి ఎవరో.. పులి ఎవరో అప్పుడే అర్థం అయిపోతుంది. మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలు గుంపులుగా వస్తాయి. కాంగ్రెస్, జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకొని గుంపుగా వస్తుంది చంద్రబాబు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదు. 

గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. ఇచ్చిన హామీలకు సమాధి కట్టాడు. మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయని కొత్త హామీలు ఇస్తున్నాడు. నమ్ముతారా.. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. నిజానికి చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ముంటే అడగండి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత ఫీజు కట్టాడో.. అంత ఫీజు చంద్రబాబు బాకీ ఉన్నట్లు.. ఆ బాకీ డబ్బులు ఎన్నికలలోపు తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. అంటే ఈ ఐదేళ్లలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు బాకీ ఉన్నట్లు. ఎన్నికలలోపు ఆ బాకీ తీర్చమని అడగండి. మీ ఓటు అడగడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను మీ బాకీ సంగతి ఏంటని అడగండి. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్‌ ఇస్తామని, మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఎన్నికలలోపే ఆ బాకీ తీర్చమని అడగండి. ఇంటికో ఉద్యోగం, లేదా రూ. 2 వేల  భృతి ఇస్తానన్నాడు. 60 నెలలకు భృతి రూ. 1.20 లక్షలు చంద్రబాబు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తానన్నాడు. పక్కా ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. వేల ఎకరాలు శ్రీకాకుళం, విశాఖ, అమరావతిలో స్వాహా చేశారు. ఆ భూమి అంతా మీదే.. అది ఇవ్వమని అడగండి. చేనేతలకు, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వస్తే ముందు ఆ బాకీ సంగతి ఏంటీ అని అడగండి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడానికి వస్తారు.. అమ్ముడుపోకండి.. ముందు మీ బాకీ సంగతి తేల్చమని అడగండి. చంద్రబాబు ఎంత డబ్బు ఇచ్చినా మీ బాకీ తీరదు.

తొమ్మిదేళ్లు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై చేయనిపోరాటం లేదు. ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు.. వారి ఇబ్బందులు తెలుసుకొని అర్థం చేసుకున్నాడు. కులాలకు, మతాలకు అతీతంగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సారి రాజన్న బిడ్డకు గొప్ప మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నా. వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత 700 మంది ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. కనీవిని ఎరుగని ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చాడు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. చెప్పిందే కాదు.. చెప్పనిది కూడా చేసే వ్యక్తి రావాలంటే జగనన్న రావాలి. మాట మీద నిలబడేవాడు రావాలంటే, మడమ తిప్పనివాడు రావాలంటే జగనన్న రావాలి. అవినీతి, కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చినవాడు పోవాలంటే జగనన్న రావాలి. రైతు మళ్లీ రాజు కావాలంటే జగనన్న రావాలి. ఈసారి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని, జగనన్నను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. 

మీ ప్రస్తుత ఎమ్మెల్యే కల్పన గెలిచింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజన్న ఫొటో పెట్టుకొని గెలిచింది. ఓట్లేసిన ప్రజలకు నమ్మకద్రోహం చేసింది. మళ్లీ అవకాశం ఇచ్చి మోసపోకండి. వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌కుమార్‌ అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించండి. ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలచుకోండి. ఆయన కొడుక్కు సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్లు. 

 

Back to Top