పసుపు–కుంకు అంతా బూటకం

సంతమాగలూరు సభ వైయస్‌ షర్మిల

బైబై బాబు..ఇదే ప్రజా తీర్పు కావాలి

చంద్రబాబును ఎవరూ నమ్మొద్దు

వైయస్‌ఆర్‌సీపీకి ఏ పార్టీతో పొత్తు లేదు..సింహం సింగిల్‌గా వస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి

అద్దంకి: చంద్రబాబు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ..ఏ ఒక్కటి నేరవేర్చలేదని, మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని మోసం చేసేందుకు వస్తున్నారని,ఆయన్ను నమ్మొద్దని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షలు వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల సూచించారు. పసుపు–కుంకుమ, పింఛన్ల పెంపు అంతా బూటకమన్నారు. మాకు పొత్తు అవసరం లేదని, జగనన్న సింహాం అని..సింగిల్‌గానే వస్తున్నారని చెప్పారు. బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగలూరులో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడారు.
బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఎవరికైనా జాబు వచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకుకు మాత్రమే జాబ్‌ వచ్చిందన్నారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలిదయని విమర్శించారు. ఏ అర్హత, అనుభవం లేని వ్యక్తికి మూడు శాఖలకు మంత్రిగా ఎలా చేశారని మండిపడ్డారు. ప్రజలకేమో ఉద్యోగాలు లేవు..ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమని, అలాంటి హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను బతికించింది ఒక్క వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో యువభేరి పెట్టి యువకులను జాగృతి చేశారని తెలిపారు.

హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. ఏ పార్టీ అయినా హోదా కోసం పోరాటం చేసిందా అని నిలదీశారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని మళ్లీ హోదా మాట అంటున్నారంటే అది జగనన్న వల్ల కాదా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని మోసపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇలాంటి హామీలను నమ్మకండి అన్నారు. పసుపు–కుంకుమ, పింఛన్ల పెంపు ఒక బూటకమన్నారు. ఎన్నికల కోసం ఎర వేస్తున్నారని సూచించారు. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పాలన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు మాకు పొత్తు ఉందని అబద్ధాలు చెబుతున్నారన్నారు.

వైయస్‌ఆర్‌సీపీకి పొత్తు అవసరమా అన్నారు. మాకు బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వంటి ఏ పార్టీతో కూడా పొత్తు లేదన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలన్నీ చెప్పుతున్నాయన్నారు. దేవుడు ఆశీర్వదిస్తున్నారని, ప్రజలు దీవిస్తున్నారని, మళీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ప్రతి తల్లి తన బిడ్డను స్కూల్‌కు పంపిస్తే చాలు రూ.15 వేలు ఆ తల్లికి ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీలకు రూ.75 వేలు ఇస్తామన్నారు. రైతులకు పెట్టుబడి కోసం రూ.12500 ఇస్తామన్నారు. వరద, కరువులు వచ్చినా నష్టపోకుండా రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి, ధరల స్థీరికరణ కోసం రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థి గరిటయ్యలను గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
 

Back to Top