తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (21.08.2026) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీ వైయస్ జగన్ హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.