అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరిన వైయస్‌ జగన్‌

తిరుపతి: ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు కొద్ది సేపటి క్రితం అలిపిరి ప్రాంతం నుంచి బయలుదేరారు. అంతకుముందు అలిపిరి వద్ద జననేతకు పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాలినడకన బయలుదేరిన వైయస్‌ జగన్‌ రాత్రికి తిరుమలలో బస చేస్తారు. రేపు సాధారణ భక్తుడిలా శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందనున్నారు.
 

Back to Top