కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తా

నంద్యాల సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఉప ఎన్నికలప్పుడు నంద్యాలపై చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చింది

ఉప ఎన్నికలప్పుడు బాబు లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు

పేదవాడికిచ్చే ప్లాటుకు నెల నెలా రూ.3 వేలు కడుతూ పోవాలట

మనం అధికారంలోకి వచ్చాక కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తాం

ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీ లేదు..కొత్త పరిశ్రమలు రాలేదు

మీ బాధలు, కష్టాలు చూశాను..మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నా

 

కర్నూలు: మనందరి ప్రభుత్వం రాగానే కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేశవరెడ్డి బాధితులకు ఒక్క రూపాౖయెనా ఇప్పించారా అని ప్రశ్నించారు. నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక అన్యాయాలు, అక్రమాలు చూశామని, దేశంలోనే ఇలాంటి ఎన్నిక జరిగి ఉండకపోవచ్చు అన్నారు. ఉప ఎన్నిక సందర్భంలో నంద్యాలపై చంద్రబాబుకు విఫరీతమైన ప్రేమ పుట్టుకువచ్చిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

  • 19 నెలల క్రితం ఇదే నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆరోజు ఎన్నేన్ని డ్రామాలు జరిగాయో మీ అందరికి తెలిసిందే. ఇదే నంద్యాల మీద చంద్రబాబుకు అంతవరకు ప్రేమ రాలేదు. ఉప ఎన్నికలు రాగానే హఠాత్తుగా నంద్యాలపై ప్రేమ పొంగింది. లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు. మనషులను కొన్నారు. కొందర్ని ప్రలోభపెట్టారు. దేశంలోనే ఇంతటి అన్యాయమైన, అరాచకమైన ఎన్నికల ఎప్పుడు జరిగి ఉండదు.
  •  ఇదే నంద్యాలలో ఆ రోజు చేపట్టిన రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ఇచ్చారా చంద్రబాబూ? అంటే..లేదు..లేదు..60 అడుగుల రోడ్డు విస్తరణలో 50 శాతం మందికి ఇంకా నష్టపరిహారం అందలేదు. ఓట్లు వేస్తే ఆ రోజు ఇల్లు ఇస్తామన్న పెద్ద మనిషి ..ఇళ్ల విషయంలో కూడా పేదవాడిని ఏ రకంగా దోచేశారో నంద్యాలే ఉదాహరణ. 
  •  పేదవాడికి 300 అడుగుల ప్లాట్‌ కట్టడానికి స్థలం ఉచితం, గ్రైనెట్‌ ప్లోరింగ్‌ లేదు. లిప్టు లేదు. అలాంటి ప్లాట్‌ కట్టడానికి రూ.1000 అడుగుకు పట్టదు. అలాంటిది చంద్రబాబు  అడుగుకు రూ.2 వేలకు కడుతున్నట్లు లంచాలు తీసుకున్నారు. స్కామ్‌లో చేయడంలో కూడా పేదవాడి నెత్తిన అప్పులు మోపి చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్న పరిస్థితి గమనించండి. రూ.6 లక్షలకు పేదవాడికి ప్లాట్లు అమ్ముతున్నారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్రం, రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగతా రూ.3 లక్షలు పేదవాడు కడుతూ పోవాలట. పేదవాడు ఆ అప్పు తీర్చాలట. 20 ఏళ్ల పాటు ఆ పేదవాడు నెలకు రూ.3 వేలు కడుతూ..పోవాలట. గతంలో పాదయాత్రలో చెప్పినది మళ్లీ పునర్ఘుటిస్తున్నాను. పేదవాడికి ఇస్తున్న పాట్లను ఎవరు కూడా వద్దు అనకండి. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పేదవాడి అప్పు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నా..
  •  ఇక్కడే ఆగ్రిగోల్డు బాధితులు కూడా ఎక్కువే. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అదిగో డబ్బు..ఇదిగో డబ్బు అని ఎదురుచూస్తున్నాం. అగ్రిగోల్డు బాధితులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. పైగా ఆగ్రిగోల్డు ఆస్తులను చంద్రబాబు, ఆయన బినామీలు కాజేస్తున్నారు. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి నేనున్నానని హామీ ఇస్తున్నాను.
  •  కేశవరెడ్డి బాధితుల పరిస్థితి కూడా  అంతే. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు కేశవరెడ్డి వియ్యంకుడు. కేశవరెడ్డి పిల్లలకు చదువులు చెబుతానని చెప్పి వేలకు వేలు, లక్షలు తల్లిదండ్రుల నుంచి దోచేసి ఎగనామం పెట్టారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇప్పించలేదు. బాధితులకు ఏమాత్రం కూడా న్యాయం జరుగలేదు. ప్రతి బాధితుడికి ఇవాళ హామీ ఇస్తున్నాను. కేశవరెడ్డి నుంచి కచ్చితంగా మీకు డబ్బులు వచ్చేలా హామీ ఇస్తున్నాను. కేశవరెడ్డి ఆస్తులను అప్పన్నంగా అమ్ముకుంటున్నారు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు న్యాయం చేస్తాం.
  •  ఆటోనగర్‌ వాసులకు పట్టాలిస్తామని ఉప ఎన్నికల్లో చెప్పారు. అప్పుడు చెప్పిన మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఆ రోజు చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఫాతిమా మెడికల్‌ కాలేజీ పిల్లలకు మైక్‌లు ఇచ్చి ఉప ఎన్నికల్లో చెప్పించారు. ఇవాళ ఆ కాలేజీ పిల్లలు చంద్రబాబు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రతి అడుగులోనూ మనకు కనిపించేది మోసం..మోసం..మోసం కనిపిస్తుంది.  ఇలాంటి పాలన పోవాలి. మార్పు తీసుకువచ్చేందుకు మీ అందరూ నడుం బిగించాలిజ
  •  మీ అందరూ ఒక్కటి ఆలోచన చేయండి. చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో ఆలోచన చేయండి. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. రైతుల రుణాలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఉద్యోగాలు తగ్గాయి. నిరుద్యోగం రెట్టింపు అయ్యింది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. బాబు వచ్చారు..ఉన్న జాబులు ఊడగొట్టారు. ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఎగ్గొట్టారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. సున్నా వడ్డీ రుణాలు రద్దు అయ్యాయి. మహిళలకు భద్రత కరువైంది. 5 నిమిషాల్లో పోలీసులు వస్తారన్న మాట ఎండమావి అయ్యింది. ఒక మహిళా ఎంఆర్‌వో ఇసుక మాఫియాను అడ్డుకంటే..టీడీపీ ఎమ్మెల్యే జట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ నడిబొడ్డుపై కాల్‌మనీ – సెక్స్‌రాకెట్‌ జరిగితే..టీడీపీ నేతలను శిక్షించలేకపోయారు చంద్రబాబు.
  • ఐదేళ్ల పాలనలో పంట విస్తీర్ణం తగ్గింది. బీసీలపై ప్రేమ అంటారు. అదే బీసీ పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాతర వేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీల భూములు చంద్రబాబు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా లాక్కుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఆరువేల ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. ఎక్కడపడితే అక్కడ మందుషాపులు, బెల్టుషాపులు ఏర్పాడ్డాయి.
  •  చంద్రబాబు హయాంలో చదువు చెప్పించడం కథ దేవుడెరుగు. ప్రభుత్వ పాఠశాలలను నిర్యీర్యం చేశారు. చంద్రబాబు పాలనలో 108 గ్రామాల్లో తిరగడం పూర్తిగా తగ్గిపోయింది. ఆరోగ్యశ్రీ కాస్తా  అనారోగ్యం పాలైంది.  ఆరోగ్యశ్రీ అమలు కా దీర్ఘకాలిక రోగాలకు మందులు పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపించాయి. ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీ మాఫియాలు తయారు అయ్యాయి.
  •  చంద్రబాబు హయాంలో యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు వెళ్లి వైద్యం చేయిస్తారు. పేదవాడికి రోగం వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు పాలనలో ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు. వీరబాదుడు కనిపిస్తుంది.
  •  అక్షరాల 650 హామీలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పారు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉందో టీడీపీ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఇచ్చిన 650 హామీల్లో కనీసం ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. 
  •  ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. మైక్‌ పట్టుకొని రాజకీయ నాయకుడు వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ రాజకీయాలు మారుతాయి. అప్పుడే విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. 
  •  ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబు ఒ క్కడితోనే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, అమ్ముడుపోయిన అనేక చానల్స్‌తో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికలు ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక అబద్ధం చెబుతారు. దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా బలంతో ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారు. 
  • ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు.  ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.
  •  నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్రాకిశోర్‌రెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
Back to Top