చంద్రబాబు ఓ సైబర్‌ నేరస్థుడు

ఎల్లో మీడియా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ప్రజల డేటాను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు?

ఇలాంటి వ్యక్తికి మనం ఓటేయ్యాలా అనేదానిపై మీరంతా చర్చ పెట్టండి

ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు ఓటు ఉందో? లేదో చూడాలి

1950 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది

 

కాకినాడ: చంద్రబాబు నాయుడు ఓ సైబర్‌ నేరస్థుడని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు దొంగలించడానికి ముఖ్యమంత్రి ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దొంగ సర్వేల పేరుతో, ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తూ ప్రభావితం చేస్తారని, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని సూచించారు. కాకినాడ సభలో ఓటు ప్రాధాన్యతను వైయస్‌ జగన్‌ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలకు 36 గంటలకు ముందు లగడపాటి సర్వే అంటూ ఊదరగొట్టారు. కాంగ్రెస్‌ పార్టీ, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని ఓటర్లను ప్రభావితం చేసేందుకు లడగపాటి సర్వేలు విడుదల చేశారు. ఎల్లో మీడియా ఈ సర్వేను నెత్తిన పెట్టుకొని మోసింది. ఈ లగడపాటి అనే వ్యక్తి ఎలాంటోడు, ఎల్లోమీడియా ఎలాంటిదో దేవుడు ఏపీ ఎన్నికలకు ముందే సినిమా చూపించారు. ఇంటెలిజెన్సీ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడేందుకు లేరు. వీరికి శాంతిభద్రత పట్టడం లేదు. చంద్రబాబు వీరిని వాచ్‌మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారు. గ్రామాలకు వచ్చి ఇంటలిజెన్సీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులను ఏ రేటుకు కొనాలో సర్వేలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఇంతదారుణంగా వాడుకుంటున్నారు.
ముఖ్యమంత్రి ఎవరండి మన వివరాలను దొంగలించడానికి?
 జిత్తులమారి నక్క గురించి ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి. తనకు ఓటు వేయరని తెలిస్తే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఓటు వేసేవారిని రెండు ఓట్లు చేరుస్తారు. చంద్రబాబు  సైబర్‌ క్రైమ్‌ చేశారు. ముఖ్యమంత్రి ఎవరూ మా ఆధార్‌ వివరాలు సేకరించి ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వడానికి ఆయనకు ఏ హక్కు ఉందని చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవరూ మా వివరాలు వేరే వారికి ఇవ్వడానికి అన్న చర్చ పెట్టండి. ప్రజల డేటాను దొంగలించిన చంద్రబాబు పార్టీని రద్దు చేయాలి. ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా అని ఒక్కసారి ఆలోచన చేసేలా గ్రామాల్లో చర్చ పెట్టండి. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయారు. ఓట్లు తీసేస్తు దొరికిపోయారు. దొంగ ఓట్లు చేరుస్తూ కూడా అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి నాయకుడిని ఎక్కడైనా మనం చూశామా? ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చూడండి. చంద్రబాబు చేర్చిన దొంగ ఓట్లను తొలగించాలని ఫామ్‌–7 ఇస్తే..అలాంటి అప్లికేషన్‌ పెట్టడమే తప్పు అన్నట్లుగా వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇలాంటి అన్యాయంపై గ్రామాల్లో చర్చ పెట్టండి.
మొన్న చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూసినప్పుడు నిజంగా ఇలాంటి వ్యక్తి మనకు సీఎంగా ఉండటం దౌర్భగ్యం. ఓటుకు కోట్లు కేసు తరువాత తానే తెలంగాణతో రాజీ పడ్డానని చెప్పారు. అదే ప్రెస్‌మీట్‌లో ఒక అడుగు ముందుకు వేస్తూ తాను ఓట్ల కోసమే పసుపు–కుంకుమ పేరుతో డబ్బులు పంచుతున్నానని చెప్పారు. తన స్వార్థం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన ఈ వ్యక్తిపై ప్రతి చోట చర్చ జరిగేలా చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఏం చేయాలన్న అంశాలపై కాస్త లోతుగా ఆలోచన చేయండి. బూత్‌ కమిటీలో ఉన్న మనమంతా కూడా గ్రామాల్లోకి వెళ్లాలి. 35 ఇళ్లకు ఒక బూత్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్లాలి. మనం చేయాల్సింది మొట్ట మొదట మనం చేయాల్సింది. ఆ ఇంట్లో ఓటు ఉందా? అన్నది తెలుసుకోవాలి. ఓటర్‌ ఐడీ కార్డు మీద ఎపిక్‌ నంబర్‌ ఉంటుంది. 1950 నంబర్‌కు ఆ ఎపిక్‌ నంబర్‌తో ఎస్‌ఎంఎస్‌ చేయాలి. అప్పుడు మన ఓటు ఉందో లేదో తెలుస్తుంది. మన వారి ఓటు లేదనుకుంటే వెంటనే ఫామ్‌–6 ఫైల్‌ చేయాలి. ఈ ఫామ్‌–6 ఆన్‌లైన్‌లో లభిస్తోంది. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఈ అప్లికేషన్‌ దొరుకుతుంది.ఒక వేళ చంద్రబాబు మన ఓటు తీసేస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఎంఆర్‌వో కార్యాలయంలో కూడా ఈ అప్లికేషన్‌ దొరుకుతుంది. మన గ్రామాల్లోనే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఆయన వద్ద కూడా ఈ అప్లికేషన్‌ దొరుకుతుంది. ఓటర్‌ నమోదుకు కేవలం ఐదు రోజులే గడువు ఉంది. ఆ తరువాత నమోదు కార్యక్రమాన్ని ఆపేస్తారు. ఈ ఐదు రోజులను మనం ఉపయోగించుకోవాలి. దొంగ ఓట్లను తీయించేందుకు ఫామ్‌–7ను ఉపయోగించుకోవాలి. 39 లక్షల దొంగ ఓట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మనకు టీడీపీ కూటమికి ఓట్ల తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం ఉండదు. ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు చేయని మోసం ఉండదు. చెప్పని అబద్ధం ఉండదు. వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. ఇవన్నీ కూడా ఎల్లోమీడియాలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చంద్రబాబుకు అమ్ముడపోయిన వాళ్లే. మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబు ఒక్కడితోనే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో యుద్ధం చేస్తున్నామన్నది మరిచిపోవద్దు. ఎన్నికలు దగ్గరకు రాగానే చంద్రబాబు మూటలు మూటల డబ్బు పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతుల్లో రూ.3 వేలు డబ్బు పెడతారు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేస్తారు కాబట్టి మీరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పాలి.  
 

Back to Top