బాలగంగాధర తిలక్ త్యాగాలను స్మ‌రించుకుందాం

జయంతి సంద‌ర్భంగా వైయ‌స్ జగన్ ఘ‌న నివాళులు
 

తాడేపల్లి:   స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ దేశ సేవ‌కు చేసిన త్యాగాల‌ను స్మ‌రించుకుందామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఇవాళ‌ బాలగంగాధర తిలక్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌ నివాళులు అర్పించారు. ఈ  మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ..
‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని గ‌ర్జించి స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానాయకుడు బాల‌గంగాధ‌ర్ తిల‌క్ గారు. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ బాల‌గంగాధ‌ర్ తిల‌క్ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు.

Back to Top