ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్దు.. అండ‌గా నేనుంటా..

పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు, పులివెందుల ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

వైయ‌స్‌ఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. త‌న‌ను క‌లిసేందుకు క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన‌వారందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైయ‌స్‌ జగన్‌ భరోసానిచ్చారు. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు, అభిమానులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చారు.

Back to Top