గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

ప్రొబేష‌న్ డిక్ల‌రేష‌న్ ఫైల్‌పై సీఎం సంత‌కం

తాడేప‌ల్లి: గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్ష ఉత్తీర్ణులైన అందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయిస్తూ.. ఈ మేర‌కు ప్రతిపాదనపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సంతకం చేశారు. ఇవాళ లేదా రేపు అధికారికంగా ఉత్త‌ర్వులు వెల‌వ‌డ‌నున్నాయి. సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top