నాణ్య‌మైన విద్య పిల్లలు పెద్ద కలలు కనేలా ప్రేర‌ణ‌

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి: నాణ్యమైన విద్య, ప్రపంచానికి పరిచయంతో పిల్లలు పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తాయ‌ని వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ బాలల దినోత్సవం సందర్బంగా వైయ‌స్‌ జగన్.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ త‌న ఎక్స్  ఖాతాలో పోస్టు చేశారు.

వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..
‘నాణ్యమైన విద్య, ప్రపంచానికి పరిచయంతో పిల్లలు పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తాయి. మనం వారిని ఆ మార్గంలో నడిపించాలి. శక్తివంతమైన, ప్రగతిశీల భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారి పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయాలంటే అందుకు వారికి అధికారం కల్పించాలి’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  

Back to Top