వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్ 'కాకినాడ డిక్లరేషన్' విడుదల

 కాకినాడ: 'కాకినాడ డిక్లరేషన్' పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఏకగ్రీవం గా ఆమోదం లభించిందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు తెలిపారు. కాకినాడ సూర్యకళా మందిర్లో బుధవారం నిర్వహించిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను గురువారం ఆయన విడుదల చేశారు.

డిక్లరేషన్లోని ముఖ్యాంశాలివీ
* 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నిం టినీ అమలు చేయాలి. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడంతో దళిత జాతికి జరిగిన ఆర్థిక నష్టం (బకాయిలు) వెంటనే చెల్లించాలి.
* విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక.
* రాజధాని ప్రాంతంలో దళితులకు జరుగుతున్న అన్యాయా లకు ఖండన. అసైన్డ్ భూములు, ఇళ్ల స్థలాలు, రైతు కూలీ
లకు భృతి చెల్లించే విషయమై ప్రభుత్వం స్పందించాలి.
లేదంటే ఉద్యమం తప్పదు. రాష్ట్రవ్యాప్తంగా దళితు లపై దాడులు, అత్యాచారాలు, హత్యలను వెంటనే ఆపాలి. రాజకీయ కక్ష సాధింపులకు ఫుల్స్టాప్ పెట్టాలి.
* గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో హత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ  దళిత కార్యకర్త మందా సాల్మన్ కుటుంబా నికి 2 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.కోటి ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంలో దుర్మార్గ చం ద్రబాబు ప్రభుత్వ వైఖరి పూర్తిగా మానవ హక్కులు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి.
* దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి.
- దళిత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళిత మహిళలకు ఇస్తానన్న రూ.15 వేలు పథకాన్ని వెంటనే అమలు చేయాలి.
* చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం విష సంస్కృతిని తక్షణమే నిలుపుదల చేసి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడాలి.
వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే దళిత జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని తీర్మానించారు.

Back to Top