కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: కళికిరి పట్టణం వద్ద ఎన్‌హెచ్–71 ఫ్లైఓవర్‌కు సంబంధించిన ప్రవేశ, నిష్క్రమణ మార్గాల సమస్యపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు మిధున్‌రెడ్డి, గురుమూర్తి క‌లిశారు. ఎన్‌హెచ్–71 పై సరైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రజల రాకపోకలు సౌకర్యవంతంగా లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో కళికిరి పట్టణ ప్రజల్లో ఆశలు చిగురించాయి. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top