బొత్స సత్యనారాయణను పరామర్శించిన అంబటి రాంబాబు 

విజయనగరం: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలుసుకుని పరామర్శించారు. విజ‌య‌న‌గ‌రంలోని బొత్స సత్యనారాయణ స్వగృహంలో జరిగిన ఈ సమావేశం సౌహార్ద వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై బొత్స సత్యనారాయణను పరామర్శించారు.
 

Back to Top