ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్ జగన్ తీవ్ర సంతాపం 

తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

ముద్రగడ పద్మనాభం కుమారుడు  ముద్రగడ గిరిబాబు కు వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రజల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు.

ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
 

Back to Top