తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.