వైయస్‌ జగన్‌ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారు

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌

అమరావతిః రాష్ట్రాభివృద్ధికి మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు.గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత సంఘటన  ఉదాహరిస్తూ...2009 ఎన్నికలకు ముందు  వేదాద్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి  నందిగామ నియోజకవర్గానికి వైయస్‌ఆర్‌ వచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ వద్దకు వెళ్ళి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని..మా నందిగామ నియోజకవర్గ ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారని..వంద కోట్లు ప్రాజెక్టు ఇస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని  చెప్పి చిన్న కాగితం ముక్కపై రాసిచ్చానని తెలిపారు.తక్షణమే అదే వేదికపై సభాముఖంగా 100 కోట్లు ప్రకటించి కుడిమెట్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.రైతాంగం పట్ల వైయస్‌ఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి  ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలిపారు.రాష్ట్రాన్ని సస్యశ్యామలం బాటగా తీసుకెళ్తారన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top