కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు

కోడి రామ‌కృష్ణ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం 
 

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం చిత్ర సీమ‌కు తీర‌ని లోటు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల వైయ‌స్ జ‌గ‌న్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడి రామ‌కృష్ణ  శ‌తాధిక ద‌ర్శకుడిగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు చిత్ర సీమ‌కు అందించారు. ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ  ముందు వ‌రుస‌లో ఉంటారు.  ఇలాంటి గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం సినీ ప‌రిశ్రమ‌కు తీర‌ని లోటని.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థించారు.

Back to Top