పార్టీ కార్య‌క‌ర్త న‌ర్రెడ్డి  ల‌క్ష్మారెడ్డికి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జూలకల్లు గ్రామంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ నర్రెడ్డి లక్ష్మారెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. 
దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న వైయస్‌ జగన్, లక్ష్మారెడ్డికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పిడుగురాళ్ళలోని పల్నాడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడిన  వైయస్‌ జగన్, బాధితుడికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు.

Back to Top