మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదు

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ

విజ‌య‌వాడ‌: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ తీసుకోవాల‌ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.  నెల్లూరు రూర‌ల్ రామ‌కోటిన‌గ‌ర్ లో యువతిపై అమానుషంగా దాడి చేసి, క‌ర్ర‌ల‌తో కొడుతూ హింసించిన ఘ‌ట‌న‌ సీఎం శ్రీ వైయ‌స్ జ‌గన్ గారిని చాలా తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని ఆమె చెప్పారు. అలాగే విశాఖలో తొమ్మిదేళ్ల ఇద్ద‌ర బాలికలపై జ‌రిగిన‌ అఘాయత్య‌ ఘటనపై కూడా సీఎం శ్రీ జ‌గ‌న్ గారు స్పందించార‌ని తెలిపారు. ఈ రెండు సంఘ‌ట‌న‌లపై చాలా సీరియ‌స్ గా ముఖ్యమంత్రిగారు స్పందిస్తూ.. ఇంత దారుణంగా జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో చాలా కఠినంగా వ్య‌వ‌హ‌రించాలి, త‌క్ష‌ణం నిందితుల‌ను అదుపులోకి తీసుకుని ఎన్ని సెక్ష‌న్ లు ఉంటే అన్ని సెక్ష‌న్ లు పెట్టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.  
- ఆ కుటుంబానికి స‌త్వ‌రం న్యాయం అందించ‌డానికి అధికారం యంత్రాంగం సిద్దం కావాల‌ని స్వ‌యంగా సీఎంగారు ఆదేశించారు
-  ప్ర‌భుత్వ ప‌రంగా ర‌క్ష‌ణ‌గా ఉండ‌డానికి ముందుకు వ‌స్తున్నా కూడా స‌మాజంలో ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల, మ‌హిళ‌ల ప‌ట్ల ఉన్న‌టువంటి సైకో మ‌న‌స్త‌త్వంతో, మృగాలుగా మారుతున్న ప‌రిస్థితి ఇటువంటి సంఘ‌ట‌న‌ల‌కు కార‌ణం అవుతున్నాయి
-  దేశంలోనే మ‌హిళ‌ల ప‌ట్ల క్రైమ్  4రెట్లు పెరిగింద‌ని జాతీయ మ‌హిళా కమిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు
- ఈ ప‌రిస్థితుల్లో ఒక ఉమ్మ‌డి బాధ్య‌త‌గా ప్ర‌తి చోట‌, ప్ర‌తి పాఠ‌శాల, ప్ర‌తి స్థ‌లంలో కూడా మ‌హిళ ప‌ట్ల‌, ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల‌ ర‌క్ష‌ణగా ఉండ‌డానికి ప్ర‌తి పౌరుడు బాధ్య‌త తీసుకోవ‌ల్సిన అవ‌సరం ఉంది.
- ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే ఇక్క‌డి ప్ర‌భుత్వం ఊరుకోదు, ఇక్క‌డి స‌మాజం ఊరుకోదు.. మ‌న స‌మాజంలో ఇటువంటి మృగాళ్ళు ఉండ‌డానికి వీల్లేద‌ని ఒక ప్ర‌తిజ్ఞ‌లా ప్ర‌తి ప‌ల్లె తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.
- ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా అంద‌రూ కూడా త‌మ బాధ్య‌త‌గా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవ‌స‌రం ఉంది
- దిశ యాప్ ను స‌హాయంగా తీసుకుని క‌డ‌ప‌కు చెందిన ఒక ఆడ‌బిడ్డ ఢిల్లీలో ర‌క్ష‌ణ పొందింది. ఆ ర‌క‌మైన ఒక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. 
- ఆడ‌పిల్ల‌ల‌కు త‌క్ష‌ణం స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్న‌పుడు ఇవాళ స‌మాజంలో ఉన్న పెడ‌ధోర‌ణ‌లు, మ‌గ‌వారిలో ఉన్న‌టువంటి పెడఆలోచ‌న వ‌ల్ల జ‌రుగుతున్న ఈ సంఘ‌ట‌న‌ల‌ను మార్చుకుందాం.. మ‌నంగా మార్చ‌కుందాం.. మ‌న స‌మాజంతో మార్చ‌కుందాం.. 
- ఇది ఒక య‌జ్ఞశాల‌గా భావించి మ‌న‌మ‌ధ్య ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డానికి వీల్లేదు. ఇటువంటి ఘోరాలు,నేరాలకి పాల్ప‌డిన వారి కుటుంబం మ‌న‌మ‌ధ్య త‌ల‌దించుకుని నిల‌బ‌డేటువంటి ఒక ప‌రిస్థితి ఉంటుంద‌ని ఒక హెచ్చ‌రిక తీసుకురావాలి.
- ఈ రెండు సంఘ‌ట‌న‌ల ప‌ట్ల మ‌హిళా క‌మిష‌న్ స్వ‌యంగా పోలీసుల‌తో, బాధితుల‌తో మాట్లాడింది. క‌చ్చితంగా ప్ర‌భుత్వం త‌రుపున, మా త‌రుపున అండ‌గా ఉంటాము..
- ఇటువంటి ఘోరాల‌కు పాల్ప‌డిన వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం స‌మాజం చూస్తూ ఊరుకోదు అనేటువంటిది సందేశం ప్ర‌తిఒక్కరూ తీసుకెళ్లాలి
- ఈ రెండు ఘటనలలో బాధితుల పరిస్థితిని స్వయంగా తెలుసుకొని.. పోలీస్ అధికారులతో మాట్లాడి దర్యాప్తు వివరాలను తెలుసుకోడమే కాక కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపినట్లు ఛైర్-పర్సన్ వాసిరెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top