సీఎం వైయ‌స్‌ జగన్‌ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

విశాఖపట్నం:  సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశార‌ని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి సారించిందని చెప్పారు. సోమ‌వారం విశాఖ‌లో వాసిరెడ్డిప‌ద్మ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మట్లాడుతూ.. అంతర్గత కమిటీలపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దిశా యాప్, స్పందన, వాలంటీర్ ద్వారా ఎన్నో ఘటనలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బాలికలు దగ్గర నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 

రాజకీయం రంగంలో పురుషులకు సమానంగా మహిళలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని వాసిరెడ్డి పద్మ‌ మండిపడ్డారు. 

Back to Top