మిస్టర్ గాలి కళ్యాణ్.. వాలంటరీ వ్యవస్థపై నీకున్న అభ్యంతరం ఏంటి?

మంత్రి అంబ‌టి రాంబాబు సూటి ప్ర‌శ్న‌

గోదావరి జిల్లాల్లోనే పవన్ ఎందుకు తిరుగుతున్నారు..?

పవన్ అప్పుడే ఊగిపోతాడు..అప్పుడే సాగిపోతాడు

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పవన్‌కి ఆవహించి ఉంది

సంస్కారం గురించి ప‌వ‌న్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది

చెప్పులు పట్టుకుని ..బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైంది..?

కళ్యాణ్‌ అనే పేరును పవన్‌ సార్ధకం చేసుకున్నాడు

లక్షల మంది వాలంటీర్లు రోడ్డెక్కే సరికి పవన్ భయపడ్డాడు

అందర్నీ అనలేదు..కొందర్నే అన్నాను అంటూ మాట మార్చాడు

వాలంటీర్ వ్యవస్థ రద్దు కావాలని పవన్  ఎందుకు కోరుకుంటున్నారు..?

చంద్రబాబు పాలనలో పింఛన్లు ఎలా అందాయి..?

వైయ‌స్ జగన్ పాలనలో పింఛన్లు ఎలా అందుతున్నాయో..తెలుసుకోలేని అజ్ఞాని పవన్ కల్యాణ్..

వైయ‌స్ జగన్ మళ్లీ జెండా ఎగరేస్తాడనే భయంతో దుష్టచతుష్టయం అల్లాడిపోతుంది

 జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు  

తాడేప‌ల్లి: మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై నీకున్న అభ్యంతరం ఏంటని మంత్రి అంబ‌టి రాంబాబు సూటిగా ప్ర‌శ్నించారు.  పవన్‌ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి మూల్యం చెల్లించుకున్నార‌ని గుర్తు చేశారు. అప్పుడే పవన్‌ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని తెలిపారు. మాటపై నిలబడిన వ్యక్తితం పవన్‌ది అంటూ మండిపడ్డారు. అసభ్యపదజాలం వాడిన నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా? అంటూ ధ్వజమెత్తారు. సంస్కారం గురించి పవన్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే:

వారాహి యాత్ర కాదు...నువ్వు వరాహి యాత్ర చేస్తున్నావ్‌:
- పవన్‌ కళ్యాణ్‌ రెండు విడుతలుగా యాత్రలు చేస్తున్నారు...
- ఆయనకు అప్పుడప్పుడు ‘యాత్రలు’ చేయడం అలవాటు...యాత్రలు చేస్తూ ఉంటారు. 
- ఉభయగోదావరి జిల్లాలో మొదటి విడుతగా, రెండో విడుతలో పశ్చిమ గోదావరిలో పర్యటన చేస్తున్నారు. 
- వారాహి అనే అమ్మవారి పేరును వాహనానికి పెట్టుకోవడం ధర్మం కాదని నేను చాలా సార్లు చెప్పాను..
- పోనీ వారాహి ఎక్కి భగవంతుడిలా మంచి మాటలు మాట్లాడుతున్నాడా అంటే అదీ లేదు.  
- వారాహి మీదకు ఎక్కి అన్నీ అసత్యాలు చెప్తూ దూషణలు చేస్తున్నాడు. 
- ఎప్పుడైతే ఆయన వారాహి ఎక్కి దూషణభూషణలకు దిగుతాడో, కక్షలు  కార్పణ్యాలతో మాట్లాడుతాడో, ఎప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతాడో అప్పుడు ఆ వారాహి...వరాహి అవుతుంది. 
- నువ్వు వారాహి యాత్ర కాదు...వరాహి యాత్ర చేస్తున్నావ్‌...
- ఆయన ఎక్కువ సార్లు ఆవేశ పడుతున్నాడు...ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. 
- గతంలో ఆయనకు చాలా సార్లు ఆవేశం వచ్చింది..అప్పుడెప్పుడో కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరు చెప్పి తుపాకీ పట్టుకుని తిరిగాడు. 
- ఆ తర్వాత దాన్ని హ్యాండ్‌ ఓవర్‌ చేస్తూ నేను కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెడుతున్నాను అంటూ కోటి రూపాయలు రాసిచ్చాడు. 
- ఆ కోటి ఈయన రాయలేదు...అప్పటి హీరోయిన్, ఈయన భార్య రేణు దేశాయ్‌ గారు ఇచ్చారు. 
- ఆ కోటి రూపాయలు ఏమయ్యాయో, ఆ కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏమైందో తెలియదు. 
- కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోయి ఇప్పుడు దుష్టచతుష్టయం ఫోర్స్‌ జనసేన రూపంలో వచ్చింది. 
- రాష్ట్రంలో దుష్టచతుష్టయాన్ని కాపాడుకోడానికి అప్పుడప్పుడు ఊగిపోతుంటాడు..అప్పుడప్పుడు సాగిపోతుంటారు. 
- అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తున్నారు అయ్యగారు. 
- పీఆర్పీలో ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నారు...అప్పుడు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాజశేఖరరెడ్డి గారి పంచెలు ఊడగొట్టి కొడతా అన్నాడు. 
- దానికి ఫలితం పాపం చిరంజీవి గారు అనుభవించాడు...లేదంటే ఇంకో రెండు మూడు సీట్లు వచ్చేవి. 
- ఎప్పుడైతే రాజశేఖరరెడ్డి గారిపై అవాకులు, చెవాకులు పేలి పిచ్చివాగుడు వాగాడో అప్పుడో ప్రజలు ఇతను రాజకీయాలకు పనికి రాడని ప్రజలు నిర్ణయించుకున్నారు. 

పవనం అంటే గాలి..కళ్యాణ్‌ అంటే కళ్యాణం:
- ఇతను ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు...
- ఇంతలోనే ఆవేశం వస్తుంది..ఇంతలోనే తగ్గుతుంది..అప్పుడే ఊగిపోతాడు..అప్పుడే సాగిపోతాడు. 
- ఇది చిత్రవిచిత్రమైన స్వభావం కలిగిన వ్యక్తిగా ఆ రోజే నిర్ణయించారు. 
- ఆ తర్వాత ఆ అవతారాన్ని పక్కన పెట్టి జనసేన రూపంలో వచ్చాడు. 
- నేను సంస్కారవంతుడినని చెప్పుకుంటున్నాడు. ఏంటబ్బా నీ సంస్కారం..? 
- మీ పార్టీ ఆఫీసులో వందలాది మంది కార్యకర్తలు, మీడియా అంతా ఉన్నప్పుడు కాలుకున్న చెప్పును తీసుకొని చెప్పు తీసుకుని కొడతా అని బూతు పదజాలాన్ని వాడిన నువ్వు ఇవాళ సంస్కారం గురించి నువ్వు మాట్లాడతున్నావ్‌. 
- జగన్‌ గారిని ఏకవచనంతోనే పిలుస్తాను..బహువచనంతో పిలవను అంటున్నాడు...
- నువ్వు ఏకవచనంతో పిలిస్తే...బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో నాకు అర్ధం కావడం లేదు. 
- అది నీ సంస్కారానికి సంబంధించిన అంశం అనేది నువ్వు మర్చిపోతున్నావ్‌..
- జగ్గూభాయ్‌ అంటున్నాడు..ఏకవచనంతో పిలవడు కానీ భాయ్‌ అంటాడట..
- నీ పేరేంటి పవన్‌ కళ్యాణ్‌...పవన్‌...కళ్యాణ్‌...
- కొణిదల వెంకట్రావు, అంజనీదేవి గార్లు ఎంత గొప్ప పేరు పెట్టారయ్యా నీకు...కళ్యాణ్‌ బాబు అని పెట్టారట. 
- రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను..పవనం అంటే...కళ్యాణం అంటే ఏమిటి..? 
- పవనం అంటే గాలి..కళ్యాణ్‌ అంటే కళ్యాణం.  ఎంత సార్ధక నామధేయుడివయ్యా పవన్‌ కళ్యాణ్‌ నువ్వు. 
- నిజంగా వెంకట్రావుగారు ఎంతగా భవిష్యత్తును ఆలోచించి ఆ పేరు పెట్టారో..? 
- మా అమ్మ దీపారాదన చేస్తుంటే దానిలో మా నాన్న సిగిరెట్‌ ముట్టించుకునేంత హేతువాది అని చెప్తున్నావ్‌...
- తల్లిదండ్రుల మీద గౌవరం ఇదేనా..? నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతుంటే మేం వినాల్సి రావడం మా ఖర్మ. 
- వారాహి ఎక్కి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావ్‌...

కాపులను మచ్చిక చేసుకునేందుకే నీ యాత్ర:
- అసలు ఉభయగోదావరిలోనే ఎందుకు తిరుగుతున్నావు..? ఇది దుష్టచతుష్టయం పథకం. 
- ఆ రెండు జిల్లాల్లో కాపులను మచ్చిక చేసుకుని, రెచ్చ గొట్టే ప్రయత్నం. 
- కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన టీడీపీకి కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. 
- వారంతా వ్యతిరేఖమే కాదు...కక్షతో ఉన్నారు..కారణం ఉద్యమం చేసిన కాపు నాయకులను చిత్రహింసలకు చంద్రబాబు గురిచేశాడు. 
- ముద్రగడను వెంటాడి తరిమి ఆయన్ను హింసించారు కాబట్టి. 
- చివరికి ముద్రగడ సతీమణి గారిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి వేదించి చిత్రహింసలకు గురిచేశారు. 
- ఆ ఉద్యమం సందర్భంగా అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ జగన్‌ గారు వచ్చిన తర్వాత తీసేశారు. 
- కాబట్టి కాపులు చస్తే మేం టీడీపీకి ఓటు వేసేది లేదనంటున్నారు. 
- వాళ్లందరినీ మచ్చిక చేసుకోవడానికి ఆ దుష్టచతుష్టయం చెప్పినట్లు చేస్తున్నాడు. 
- రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, చంద్రబాబు చెబితే అక్కడ మాత్రమే తిరుగుతున్నాడు. 
- తర్వాత అన్ని చోట్లకూ తిరుగుతావులే..అది వేరే విషయం. 

వాలంటీర్‌ వ్యవస్థపై అసలు నీ అభ్యంతరం ఏమిటి మిస్టర్‌ గాలి కళ్యాణ్‌..?:
- ఆ రెండు జిల్లాల్లో తిరుగుతూ హద్దులు మీరి మాట్లాడుతున్నావు.
- నీకు అసలు అంతరాత్మ ఉందా..? వాలంటీర్‌ వ్యవస్థ గురించి ఏం మాట్లాడావో గుర్తు చేసుకో.
- వాలంటీర్‌ వ్యవస్థ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ చేసేవారికి దోహదం చేస్తోంది అన్నావు. 
- స్త్రీలను అక్రమ రవాణ చేయడానికి వాలంటీర్‌ వ్యవస్థ సహకరిస్తోంది అన్నావు. 
- ఆ మాట మీద నిలబడ్డాడా అంటే అదీ లేదు. 
- వాలంటీర్‌ వ్యవస్థ రోడ్ల మీదకు వచ్చి ఇదేమీ అన్యాయం అక్రమం అంటూ ప్రశ్నించారు. 
- లక్ష 30వేల మంది మహిళా వాలంటీర్లు మహిళలను అక్రమంగా తరలిస్తున్నామా అని గొంతెత్తారు. 
- దీంతో నేను అందర్నీ అనలేదు కొంత మందిని మాత్రమే అన్నాను అని జారిపోయాడు. 
- మళ్లీ అసలు వాలంటీర్‌ వ్యవస్థ ఎందుకు అంటాడు..మరి కాసేపు ఇది జగన్మోహన్‌రెడ్డి సైన్యం అంటాడు. 
- అసలు నీ అభ్యంతరం ఏమిటి పవన్‌ కళ్యాణ్‌...మిస్టర్‌ గాలి కళ్యాణ్‌ దేనికీ నీ అభ్యంతరం..? 
- మహిళలను అక్రమంగా తరలిస్తున్నారనా, సమాంతర వ్యవస్థగా తయారవుతున్నందుకా..లేక జగన్మోహన్‌రెడ్డి గారి సైన్యం అవుతున్నందుకా అది చెప్పడు. 
- అది చెప్పాలంటే చంద్రబాబును, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులను అడగాలి. 
- దామోదరం సంజీవయ్య సమయంలో కూడా పింఛన్లు అందలేదా..? ఇవాళ పింఛన్లు అందడానికి వాలంటీర్లు కావాలా అంటున్నాడు. 
- చంద్రబాబు సమయంలో కూడా పింఛన్లు అందాయి...
- అప్పుడు ఫించన్లు ఎన్ని...ఇప్పుడెన్ని..? ఇప్పుడు ఎలా అందుతున్నాయో తెలుసా నీకు..? 
- ఒకటో తేదీ ఉదయమే 5గంటలకు వెళ్లి వృద్ధుల చేతుల్లో రూ.2750 పెడుతుంటే వారి ఆనందాన్ని పవన్‌ కళ్యాణ్‌ చూడలేకపోతున్నాడు. 
- వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి..గడప గడపకూ సంక్షేమ పథకాలను అందించడానికి తాపత్రయ పడుతున్న హృదయం జగన్‌ గారిది. 
- అది చూసి భరించలేక, ఎక్కడ జగన్మోహన్‌రెడ్డి గారు మళ్లీ వచ్చేస్తారో అనే భయంతో మాట్లాడుతున్నాడు. 
- 2.50 లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. 
- ఇంటింటికి వెళ్లి సేవ చేస్తుంటే దాని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి మళ్లీ జగన్‌ గారు జెండా ఎగురేస్తారనే భయంతో నువ్వు నీ దుష్టచతుష్టయం అల్లాడిపోతున్నారు. 
- ఏదో ఒక విధంగా వాలంటీర్‌ వ్యవస్థను దాడి చేసి కోర్టులకు వెళ్లి నిర్వీర్యం చేయాలనే తాపత్రయం నీలో కనిపిస్తోంది. 
- ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. 

పవన్‌ కళ్యాణ్‌కి మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌:
- పిచ్చి జనాన్ని ముందు పెట్టుకుని పిచ్చికూతలు కూసే పవన్‌ కళ్యాణ్‌ గారు నీకు భవిష్యత్తు లేదు..రాజకీయాలకు నువ్వు పనికిరాదు. 
- మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ నిన్ను ఆవహించి ఉంది. అప్పుడే ఆవేశం, ప్రేమ, తిట్లు, పొగడ్తలు అన్నీ వచ్చేస్తాయి. 
- క్షణకణానికి మారిపోతుంటాయి. ఐ లవ్యూ అంటాడు..కాసేపాగి ఐ హేట్‌ యూ అంటాడు. 
- నేను గాంధీ మహాత్ముడిని అంటాడు..లేదు లేదు నేను చెగువీరాని..విప్లవకారడ్ని అంటాడు..
- స్వామీ వివేకానంద నాకు ఆదర్శం అంటాడు..కాసేపట్లోనే మావో సెటాంగ్, కానూ సన్యాల్‌ నాకు ఆదర్శం అంటాడు. 
- అసలు క్లాస్‌ వార్‌ చేసే వారు ఇంటి పేరు చివర రెడ్డి పెట్టుకుంటారా అంటూ జగన్‌ గారిని విమర్శిస్తున్నాడు. 
- అసలు క్లాస్‌ వార్‌కి ఆద్యుడు తరిమెల నాగిరెడ్డి అంటాడు...
- ఇలాంటి రకరకాల డిజార్డర్స్‌ ఉన్న వ్యక్తివి నువ్వు...ఎవ్వరూ నీ వెంట నడవలేరు. 

రాజకీయాలే కాదు..వ్యక్తిగతంగానూ అతనితో ఎవరూ చివరి వరకూ నడవలేరు:
- రాజకీయ జీవితమే కాదు...వ్యక్తిగత జీవితం కూడా పరిశీలిస్తే..అతనితో పూర్తిగా ప్రయాణం చేసిన వ్యక్తులను నాకు చూపించండి. 
- రాపాక వరప్రసాద్‌ విషయాన్ని పరిశీస్తే..పవన్‌ ఓడినా రాపాక గెలిచారు. 
- నేను ఓడిపోతే రాపాక గెలవడం ఏంటని..అతన్ని ఇష్టం వచ్చినట్లు చూశాడు...
- రాపాక జనసేనలో ఇమడలేక పోయాడు..మాతో పయనం చేస్తున్నాడు. 
- నేనే ఓడిపోతే నా గుర్తు మీద గెలవడానికి నువ్వెవడివి అనే డిజార్డర్‌ పవన్‌ కళ్యాణ్‌ రాపాక వరప్రసాద్‌ పట్ల చూపించాడు. 
- జేడీ లక్ష్మీనారాయణ కూడా నీతో ప్రయాణం చేశాడు...ఇప్పుడు నీతో పాటు ఉన్నాడా..? 
- తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన రామ్మోహన్‌రావు మీ పార్టీలోకి  వచ్చాడు..నిన్ను దగ్గరుండి చూశారు. నీతో ఇమడలేమని వెళ్లిపోయాడు. 
- ఇది మల్టీ డిజార్డర్‌ ఉన్న కేసు...ఇతనితో మనం ప్రయాణం చేయలేమని నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. 
- ఇన్‌కం టాక్స్‌ కమిషనర్‌గా చేసిన పీవీ రావు, సీహెచ్‌ పార్ధసారధి ఐఆర్‌ఎస్‌ రిజైన్‌ చేసి వచ్చారు..ఈయన దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. 
- తోట చంద్రశేఖర్‌...వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. 
- చిరంజీవి గారితో చాలా సన్నిహితం. పీఆర్పీలో కూడా పోటీ చేశాడు. 
- ఆయన కూడా దగ్గరుండి చూశాడు..ఇతనికి పర్సనాలిటీ డిజార్డర్‌ ఉందని వెళ్లిపోయాడు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 
- మరిశెట్టి రాఘవయ్య కూడా ఈయన్ను దగ్గరగా చూసి భయపడి వెళ్లిపోయాడు. 
- రాజు రవితేజ అనే వారు ఇతనికి చాలా క్లోజ్‌...ఆయన జనసేన ఫౌండర్‌..ఇప్పుడేమయ్యాడు..? 

ఎప్పుడు ఏ పార్టీతో ఉంటావో నీకైనా తెలుసా..?:
- నాకు సినిమాల్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు...ఈ గదిలో షూటింగ్‌ జరుగుతుంటే నాకు ఏదో నెగిటివ్‌ ఎనర్జీ తగులుతుంది అంటాడట. 
- అదిగో ఆ మూలన పచ్చ చొక్కా వేసుకున్నోడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటాడట. 
- బౌన్సర్లను పిలిపించి ఆ పచ్చ చొక్కా వాడిని బయటకు గెంటేస్తారట. 
- మళ్లీ ఆ పచ్చ చొక్కా వక్తి కనిపిస్తే నమస్కారం బాబూ..బాగున్నావా అంటాడట..
- ఇది మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌..ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో తెలియని గాలి కళ్యాణ్‌ ఇతను. 
- ఇతను ఇవాళ జగన్‌ గారిని ఇమిటేట్‌ చేస్తున్నాడు...సినిమా యాక్టర్‌ కదా..ఇమిటేట్‌ చేస్తాడులే. 
- కామన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అన్నావు...యువరాజ్యం అన్నావు..జనసేన అన్నావు..
- తర్వాత కమ్యూనిస్టులతో ఉన్నావ్‌..బీజేపీతో ఉన్నావ్‌..టీడీపీతో అన్నావు..
- దీన్నే మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌..నువ్వు జగన్‌ గారిని విమర్శించడానికి సిగ్గుందా..? 
- మళ్లీ దేనితో ఉంటావో ఉండవో తెలియని నువ్వు జగన్‌ గారిని విమర్శిస్తావా..? 
- చాలా మంది ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌ వచ్చారు సీఎం అయ్యారు. 
- మీ సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి వచ్చారు..కాలేక నిష్క్రమించారు. 
- నాదెండ్ల భాస్కరరావు, దాసరి నారాయణరావులు కూడా పార్టీలు పెట్టి నిష్క్రమించారు. 
- ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు...అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు...ప్రజల వద్దకు వెళ్లొచ్చు. 
- నువ్వూ ఒక రాజకీయ పార్టీ పెట్టావు...జగన్‌ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. 
- ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారులు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. 
- డాక్టర్‌ వైఎస్సార్‌ మరణించిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 
- కేవలం రాజశేఖరరెడ్డి గారి కుమారుడని అందలం నేరుగా ఎక్కాడా..? 
- రాజశేఖరరెడ్డి గారి మరణానికి, జగన్‌ గారు ముఖ్యమంత్రి కావడానికి మధ్య జరిగిన సంఘర్షణ ఒక్క సారి తెలుసుకో గాలికళ్యాణ్‌..
- ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు పడ్డాడు...
- 2014లో 63 సీట్లు వస్తే మీ దత్తతండ్రి 23 సీట్లు ఎత్తుకుపోతే వెంట్రుకగా భావించాడు. 
- అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాడు. 
- జగన్మోహన్‌రెడ్డి గారిని అనే నైతిక హక్కు మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉన్న నీకెక్కడిది గాలి కళ్యాణ్‌..?
- జగన్మోహన్‌ రెడ్డి గారు పేరెత్తే అర్హత నీకు లేదు..ఇక ముందు రాదు గుర్తుపెట్టుకో. 
- కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు పాదాల వద్ద పెట్టేందుకు వారాహి యాత్ర పేరుతో కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్న నీ కుట్ర అందిరికీ తెలుసు. 
- నువ్వు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా నువ్వు జగన్‌ గారికి అడుగు దగ్గర్లోకి కూడా రాలేవు. 

నువ్వు చేసిన విప్లవం ఏంటో చెప్పు...మైకు పట్టుకుని ఊగడం విప్లవం కాదు పవన్‌:
- అదేమంటే నేను విప్లవకారుడ్ని అంటాడు..నువ్వు చేసిన విప్లవం ఏంటో చెప్పయ్యా..? 
- మైకు పట్టుకుని ఊగిపోవడం విప్లవం, పోరాటం అనుకుంటున్నావా..? 
- ఏం కష్టపుడుతున్నావు నువ్వు..సినిమాల్లో నటిస్తున్నావు..బాగా డబ్బులు తీసుకుంటున్నావుగా. 
- నువ్వు నీతిమంతుడివి అంటున్నావు కదా...పారదర్శకత ఉంది అంటున్నావు కదా...
- నువ్వు ఒక్కొక్క సినిమాకి ఎంత తీసుకుంటున్నావు..ఎంత టాక్స్‌ కడుతున్నావో చెప్పి వారాహి వ్యాన్‌ ఎక్కు..
- చెప్పకుండా వారాహి వ్యాన్‌ ఎక్కావా అది వరాహి వ్యానే. 
- నీ క్యారెక్టర్‌ గురించి తెలుసుకోవాలనుకుంటే సినిమాల్లో లైట్‌ బాయ్‌ని అడిగినా చెప్తాడు. 
- భార్యను పెళ్లాం అంటున్నారు అని కోపం వచ్చింది..విభిన్న పెళ్లిళ్లు చేసుకుంటున్నప్పుడు పెళ్లాలనే అంటారు. దాంట్లో పెద్ద తప్పులేదే..? 
- జగన్‌ గారి గురించి మాట్లాడి మీడియాలో ప్రాముఖ్యత పొందాలనే తపన పడుతున్న వ్యక్తివి నువ్వు. 
- నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేవు..చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయలేవు..
- ముందు నిన్ను సంస్కరించుకో...నీ ఆవేశాన్ని తగ్గించుకో...ఆలోచన పెంచుకో.
- మొదటి మర్యాదగా మాట్లాడతాడు..కాసేపటికి ఊగుతాడు..తర్వాత ఆవేశపడతాడు...ఆలోచన మరచి బూతులు తిడతాడు. 
- మళ్లీ సాయంత్రానికి సంస్కారం అంటే ఇలా ఉండాలి అనే మళ్లీ మనకే  ఉపన్యాసం చెప్తాడు. 
- ఇన్ని మార్పులు మారిన నువ్వు రాజకీయాలకు పనికి రావు...కొద్ది రోజులు పోతే సినిమాలకు కూడా పనికిరావు. 

అతనికి ఆరాటం తప్ప పోరాటం ఎక్కడుంది..?:
- వాలంటీర్లు వుమెన్‌ ట్రాఫికింగ్‌ అంటూ ఆరోపించావు..నిరూపించమంటే మాట్లాడడు. 
- వాలంటీర్ల వ్యవస్థ ఏమిటి..ఏమి సేవ చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు. 
- ఆఫీసుల చుట్టూ తిరగలేని అందరికీ ఉపయోగపడే ఒక మంచి వ్యవస్థ. 
- దానిపై బురదజల్లాలని తాపత్రయపడుతున్న దుష్టచతుష్టయానికి అండగా పవన్‌ కళ్యాణ్‌ నిలబడ్డాడు. 
- ఈ రాష్ట్రంలో జరిగిన విప్లవాత్మక సంస్కరణలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్‌ గారిని 175 సీట్లిచ్చి మళ్లీ అధికారంలోకి తెస్తాయి. 
- ఇది నేను చెప్తున్న మాటే కాదు...సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. 
- చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు వాలంటీర్లనే కాదు...జగన్‌ గారు పేరు వింటేనే భయపడుతున్నారు. 
- అతను ఎవరు మీద పోరాటం చేస్తున్నాడు..పోరాటం అంటే రోజూ మీటింగులు పెట్టడం అనుకుంటే పోరపాటు. 
- అతనికి ఆరాటం తప్ప పోరాటం ఎక్కడుంది..? 
- వారాహి ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పోరాటం కాదు. 
- అతని గురించి పట్టించుకోవద్దు...అతను కొంచెం తేడా మనిషి. 
- ఎప్పుడు చొక్కా ఊడదీస్తాడో...చెప్పులు తీస్తాడో తెలియదు. 
- అతని గురించి పెద్దగా పట్టించుకోవద్దు..అప్పుడప్పుడు కాస్త టీవీల్లో వేస్తే  ప్రజలకు కాలక్షేపంగా ఉంటుంది. 
- అన్నవరంలో చెప్పులు పోయాయట...బందరులో దొరికాయట...
- అతనికి పోయింది చెప్పులు కాదు...బుర్రే పోయింది...
- చెప్పులు పొతే కొనుక్కోవచ్చు..బుర్ర పోతే ఏం చేయలేం. 
- ఊరక చెప్పుల రాజకీయాలు, క్యామిడీ చేస్తుంటాడు...
- ఎంజాయ్‌ ది మల్టిపుల్‌ డిజార్డర్‌ పర్సనాలిటీ రాజకీయం. 

పోలవరాన్ని కేంద్రమే కడుతోంది..పురందేశ్వరి గారికి తెలియదేమో...?:
- పురందేశ్వరి గారికి తెలియదనుకుంటా..ఇప్పటికీ కేంద్రమే కడుతోంది..కేంద్రం పర్యవేక్షణే ఉంటుంది. 
- ఇంప్లిమెంటేషన్‌ అథారిటీ పీపీఏ..సీడబ్ల్యూసీ...ప్రతి ఒక్కటీ వారి చేతుల్లోనే ఉంది. 
- కావాలంటే తీసుకోమనండి...కేంద్ర మంత్రి గారికి చెప్పి వీళ్లు కట్టలేకపోతున్నారు అని తీసుకోమనండి. తీసుకొచ్చింది చంద్రబాబునాయుడు..
- ఏదో కొత్తగా అధ్యక్షురాలు అయ్యాను కదా అని వివాదాస్పదంగా మాట్లాడాలని ఆమె అనుకుంటున్నారేమో..?
- మహిళలపై దాడుల విషయంలో చంద్రబాబు హయాంలో ఎన్ని జరిగాయో ఆయన్నే వివరాలు ఇవ్వమనండి. 
- ఆయన హయంతో పోలిస్తే ఇప్పుడెలా ఉందో అప్పుడు చర్చించవచ్చు. 
- పవన్‌ కళ్యాణ్‌ ఊరెళ్లే వరకూ చంద్రబాబు మాట్లాడడనుకుంటా..

Back to Top