అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు

వడ్లపూడి - II సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
 

విశాఖ‌: అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి అన్నారు. శుక్ర‌వారం  87 వార్డు వడ్లపూడి - II సచివాలయం పరిధిలోని, దుగ్గపువాని పాలెం, ఉప్పరవాని పాలెం,కాశీపాలెంలో లో  గాజువాక శాసనసభ్యులు  తిప్పల నాగిరెడ్డి  గడప -గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో అడిగి తెలుసుకొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలని, సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకోవటం జరిగింది అని అన్నారు. వెలగని వీధి దీపాలు, డ్రెయిన్స్, కల్వర్ట్లు, సీ. సీ రోడ్ల నిర్మాణం, రేషన్ సరిగా అందకపోవటం మొదలుగు ప్రధాన సమస్యలు గుర్తించి, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.

87 వార్డు వై. యస్. ఆర్.సీ.పీ ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, గాజువాక వై.యస్.ఆర్.సీ.పీ ఇంచార్జ్  తిప్పల దేవన్ రెడ్డి ,ప్రగడ వేణుబాబు, బొడ్డ గోవింద్, కోమటి రమాదేవి, ప్రగడ గోవిందరాజులు, ముద్దపు దామోదర్,శీరం పాపారావు, బలిరెడ్డి నాగేస్వరావు, దుగ్గపు దానప్పలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top