కష్టకాలంలో కూడా సంక్షేమం 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు

తాడేపల్లి:  కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వైయ‌స్ఆర్‌ ‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి నారుమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు జరగడం లేదన్నారు. ఇచ్చిన హామీలన్ని ఏడాదిలోపు పూర్తి చేసిన ఘనత  సీఎం వైయ‌స్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తలపెట్టే విఘ్నాలు తొలగిపోయేలా సీఎం వైయ‌స్ జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top