చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదు

మంత్రి విడదల రజని

విశాఖ‌:  చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదంటూ  మంత్రి విడదల రజని ఫైరయ్యారు.  శుక్ర‌వారం మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకించే చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో తిరిగే హక్కు లేదు. విశాఖ పాలనా రాజధానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. ఏపీలోనే ఉనికిలేని చంద్రబాబు.. తెలంగాణలో ఏం చేస్తారు?. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top