నెల్లూరు జిల్లా: నాడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి నేడు ఆయన అత్యంత సన్నిహితులు తగిన గుణపాఠం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి(వి పి ఆర్) అన్న వేమిరెడ్డి కోటారెడ్డి బామ్మర్ది, జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు కలవకూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్‌సీపీలో చేరారు. తన తోటి తన మిత్రబృందంతో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పరిచయం చేసి, రానున్న ఎన్నికల్లో తామందరం ఏకతాటిపై సమిష్టిగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కలవకూరు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. మరో సీనియర్ రాజకీయ ప్రముఖులు లేబూరు శ్రీనివాసులు రెడ్డి (ఎల్ఎస్ఆర్), కుమార్ అన్న ( సైకిల్ షాప్ కుమార్ అన్న) తమ సంపూర్ణ మద్దతును వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రకటించి రూరల్ నియోజకవర్గంలో కనివిని ఎరుగని రీతిలో భారీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కలవకూరు శ్రీనివాసులు రెడ్డి, సైకిల్ షాప్ కుమార్ అన్న, ఎల్ఎస్ఆర్ వారి మిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని వైయస్ఆర్‌సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వారందరికీ పార్టీ అండగా ఉండి భవిష్యత్తులో అన్ని విధాల గౌరవప్రదమైన, సముచితమైన స్థానాన్ని కల్పించడం జరుగుతుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నమ్మకద్రోహులకు గుణపాఠం చెప్పే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు తామందరం సమష్టిగా కలసి కృషి చేయడం జరుగుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్వచ్ఛందంగా మద్దతు పలికిన కలవకూరు శ్రీనివాసులు రెడ్డి, ఎల్ ఎస్ ఆర్, సైకిల్ షాప్ కుమార్ అన్న తదితరులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్ టి. అశోక్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు పుట్ట విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, నియోజకవర్గంలో పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, వేణుంభాకం సుధాకర్ రెడ్డి, జార్జి, వెంకట్ రెడ్డి రామకృష్ణారెడ్డి, క్లస్టర్-1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, జే సి ఎస్ కన్వీనర్ దారా వంశీ, జిల్లా అధికార ప్రతినిధి లంక రామ శివారెడ్డి, లేబూరు పరమేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, పొట్లూరు జయవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.