నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తాం

చిన్నారి వర్షిత తల్లిదండ్రులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

చిత్తూరు: చిన్నారి వర్షితను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. కురబలకోట మండలం అంగల్లులో శుక్రవారం హత్యకు గురైన చిన్నారి వర్షిత తల్లిదండ్రులను వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డిలు పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని, నిందితులకు తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
 

Read Also: బాబూ - విజన్ కా బాప్...

Back to Top