విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వైయస్ఆర్‌సీపీపై రాజకీయ కుట్రకు తెరలేపిన సీఎం చంద్రబాబు... అందులో భాగాంగానే తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తేల్చి చెప్పారు. లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదని.... సీబీఐ సిట్ నివేదికతో వాస్తవాలు బయటపడ్డయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఒకవైపు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం, మరోవైపు బాబు కుటుంబం రూ.5వేల కోట్ల భూదోపిడీల నుంచి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే... వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు పరిక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం.. రాజకీయ కుట్రలకు తెరలేపుతూ మత విద్వేషాలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడ్డం ద్వారా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడిపిస్తున్నారని ఆక్షేపించారు. సిట్ నివేదిక ద్వారా... వాస్తవాలు బయటపడ్డంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం తమ పేరు కూడా వేసుకునే ధైర్యం లేకుండా... ఫ్లెక్సీలు, హోర్డింగులతో తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. అధికార పార్టీ చేస్తున్న దాడులకు తగిన జవాబు చెప్పడం ఖాయమన్న అమర్నాధ్... తప్పుడు ప్రచారాలకు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... ● తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం.. రాష్ట్రంలో గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయపరిణామాలతో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత 2024 సెప్టెంబరు లో పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపారు. అందుకు కలియగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదాన్ని వాడుకుంటూ.. ప్రసాదంలో జంతుకొవ్వులు కలిసాయని దుష్ప్రచారం చేశారు. కేవలం వైయస్.జగన్ పైనా, వైయస్ఆర్‌సీపీ పైన రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారానికి తెరలేపారు. తన రాజకీయం కోసం దేవుడుతో సహా ఎవరినైనా వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే కోట్లాది మంది హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ.. అసత్య ఆరోపణలు చేశారు. దానిపై వైయస్ఆర్‌సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది. ● అడ్డంగా బుక్కైనా - తప్పుడు ప్రచారం.. దీంతో తప్పుడు ఆరోపణలు చేసిన పాపం ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయంతో కూటమి నేతల్లో మొదలైంది. అసత్య ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోబావాలతో ఆడుకున్న ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకునేందుకు విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు తెరతీసింది. అందులో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా వైయస్.జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల ఫోటోలతో తిరుపతి లడ్డూ పవిత్రతను తగ్గిస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తూ ఎక్కడికక్కడ అనామకుల్లా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీనికి నిరసనగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రభుత్వానికి బుద్ధి రావాలని దేవుడ్ని ప్రార్థించాలన్న కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాళ్లు, కర్రలు, రాడ్లుతో టీడీపీ శ్రేణులు, గుండాలు ఆయనపై దాడికి దిగారు. కుటుంబ సభ్యులను పచ్చి బూతులు తిడుతూ కారుపై దాడి చేశారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మానవమాత్రులు ఎవరైనా స్పందించకుండా ఉండరు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో టీడీపీ శ్రేణలుకు, గూండాలకు రక్షణ నిల్చారే తప్ప పోలీసులు వారిని నియంత్రించలేదు. అనంతరం తన వ్యాఖ్యలపట్ల అంబటి రాంబాబు గారు విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా స్థానిక చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో స్థానిక శాసనసభ్యురాలు, ఆమె భర్త ఆధ్వర్యంలో వేయి మంది వరకు టీడీపీ శ్రేణులు, గూండాలు అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం చేసి ఇళ్లు తగులబెట్టారు. ఇంత జరుగుతున్నా గుంటూరులో పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నారు. ఇటీవల కాలంలో రాష్ర్టంలో విచ్చలవిడిగా జరుగుతున్న కోడిపందాలు, అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు, పేకాటల జరుగుతుంటే దగ్గరుండి రక్షణ కల్పించడంలో బిజీగా ఉన్న పోలీసులు... అదే తరహాలో టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే వారికి రక్షణగా నిలబడ్డారు. రాష్ట్రంలో విఫలమైన శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం. ● రాష్ట్రంలో ఆటవిక పాలన... మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి తగులబెట్టి.. ఇంట్లో ఉన్న మహిళలను సజీవ దహనం చేసే ప్రయత్నం చేయడం దారుణం. ఈ దాడి జరిగి 24 గంటలు గడవకముందే మరలా మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పెట్రోల్ బాంబులతో తగులబెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు ఇదే నిదర్శనం. రెడ్ బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. ● బాబు కుటుంబం భూదోపిడీ నుంచి డైవర్షన్.. తిరుపతి లడ్డూ అంశంతో పాటు విశాఖలో చంద్రబాబు కుటుంబం చేస్తున్న రూ.5 వేల కోట్ల భూదోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ విధ్వంసానికి తెరతీశారు. వైయస్ఆర్‌సీపీనేతల ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగబడుతున్నారు. అధికార పార్టీ శ్రేణులే ఈ రకంగా దాడులకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంటే... ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్తలు ముందుకు రారు. మరోవైపు 44 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన చంద్రబాబు బంధువు,విశాఖ ఎంపీ తమ ఆధీనంలో ఉన్న భూమి విలువ కేవలం రూ.1000 కోట్లేనని చెబుతున్నాడు. అంటే తాను కబ్జా చేసిన భూమి విలువ రూ.5వేల కోట్లు అని వైయస్.జగన్ అంటున్నారు.. కానీ రూ.1000 కోట్లే అని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాన్ని తీసుకుంటామని చెబుతున్నారు. అదే విధంగా వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎకరం రూ.1 కోటికే కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మా హయాంలో కేటాయించిన స్కూల్ కి కొన్ని నిబంధనలు విధించాం. 25 శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించాం. ఇదే గీతం సంస్థ 1998లో 71 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం ఎకరా రూ.18వేలకే తీసుకున్నారు. గీతం సంస్ద నెలకొల్పి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. ఇంతవరకు ఒక్కరికైనా ఉచితంగా సీటు ఇచ్చారా? పైగా ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని దాన్ని బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. మీరు ప్రభుత్వ భూమిని 44 ఎకరాలకు పైగా ఆక్రమించి.. పరిరక్షించామని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ప్రభుత్వ భూమి మీ జాగీరు కాదు? మా నాయకులు మీద దాడి చేసి, మా ఇళ్లకు నిప్పంటిస్తే మీరు చేసిన దుర్మార్గాలు మరుగున పడిపోతాయని భావించవద్దు, కచ్చితంగా దీనిపై మా పోరాటం కొనసాగుతుంది. కౌన్సిల్ లో తీర్మానాన్ని మేం వ్యతిరేకిస్తే.. మా పార్టీ ప్రతినిధులు లేకుండా తలుపులు వేసుకుని మీకు మీరే ఆమోదం చేసుకుని.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ దోపిడీపై ఉత్తరాంధ్రాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ● అబద్దాలతో మత విద్వేషాలకు కుట్ర... మీ భూదోపిడీని, రాజకీయ కుట్రలను, తిరుపతి లడ్డూ పై చేస్తున్న రాజకీయ కుట్రలను కచ్చితంగా తిప్పికొడతాం. ప్రశాంతమైన విశాఖలో నిన్న మరలా అదే దుష్ప్రచారంతో కూడిన ప్లెక్సీలు కట్టారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీసీ పుటేజీలో టీడీపీ వార్డు ప్రెసిడెంట్, ఐ టీడీపీ కార్యకర్త కలిసి ఆ ఫ్లెక్సీ కట్టారు. మీరు చేస్తున్నది దుష్ప్రచారం అని మీకు తెలుసు. మీకు ధైర్యం ఉంటే.. సిట్ లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని తేల్చింది అని మీరు చెబుతున్నది నిజం ఆయితే మీ పేరు రాసి మరీ ఫ్లెక్సీలు పెట్టండి. ఎందుకు భయపడుతున్నారు? అంటే కేవలం మత విద్వేషాలను రెచ్చడానికి మీరు చేస్తున్న కుట్ర ఇది. తనపై దాడి చేసి, తన కుటుంబాన్ని దారుణంగా బూతులు తిడుకుంటే వారిపై అంబటి రాంబాబు గారు ప్రతిస్పందిస్తే... దాన్ని చంద్రబాబుకు ఆపాదించి దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని కచ్చితంగా కాపు నాయకుల మీద దాడిగా పరిగణిస్తాం. చంద్రబాబుతో ఉంటేనే కాపులా.. రాజకీయంగా విభేదిస్తే వారిపై దాడులు చేసి హతమారుస్తారా? నాడు వంగవీటి రంగా నుంచి ముద్రగడ పద్మనాభం నేడు అంబటి రాంబాబు వరకు ఆ రకమైన దాడులే చేస్తున్నారు. ● దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం.. అసభ్యపదజాలం, బూతులు గురించి నీతులు చెబుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో సహా కూటమి నేతల బూతుల పంచాంగం పై ఏం సమాధానం చెబుతారు? ఒక్కసారి వీరి బూతులు .. ఇవాళ వీరు చెబుతున్న నీతులు వింటే ఎవరేంటో అర్ధం అవుతుంది. అయినా అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినా కూడా.. ఓ కేంద్ర మంత్రి 24 గంటల్లో సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇస్తుంటే.. మంత్రి లోకేష్ జరుగుతున్నదంతా లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. మీ తప్పుడు ప్రచారాలకు తగిన జవాబు చెప్పే రోజు వస్తుందని హెచ్చరించిన అమర్నాధ్.. మీ తప్పుడు ప్రచారానికి స్వామివారు తగిన శిక్ష విధించడం ఖాయమని స్పష్టం చేశారు.