పుంగనూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం  నిర్వహించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, జిల్లా టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై నాయకులు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  

Back to Top