తిరుమలలో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు

సప్త వాహనాల్లో శ్రీవారి ఊరేగింపు.. భక్తులకు దర్శనం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం

టీటీడీ చైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాల్లో ఊరేగింపుగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల తరువాత రథసప్తమి అత్యంత గొప్ప ఉత్సవమన్నారు. సాయంత్రంలోపు ఏడు వాహనాల్లో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం స్వామివారికి ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు లక్ష మంది భక్తులు ఉత్సవాలకు హాజరయ్యారని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే వేడుక నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులందరికీ సకాలంలో ప్రసాదం, అన్నదారం, టిఫిన్లు అందిస్తున్నామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top