టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం

విష ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

అమరావతి: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొట్టేలా పచ్చమీడియా ప్రయత్నం చేస్తుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవోగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ–5 ఛానల్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టిందని తెలిపారు. సంబంధిత వెట్‌సైట్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారాలు  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ 50 రోజుల్లో టీడీపీ మరింత దిగజారిందని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తమ చేతిలో ఉన్న ఎల్లోమీడియాను వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్‌అయ్యారు. విష ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

Back to Top