సోషల్ మీడియా పోస్ట్ లపై స్పందించిన టీటీడీ చైర్మన్

లగేజీ డిపాజిట్ కేంద్రంలో వైవి సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీ
 

తిరుమ‌ల‌:   అలిపిరి వద్ద గల టీటీడీ యాత్రికుల లగేజీ డిపాజిట్ కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. భక్తుల లగేజీ బ్యాగులను సిబ్బంది ఇష్టానుసారంగా వ్యాన్ లోకి విసరేస్తూ లోడ్ చేస్తున్నారంటూ  ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు వీడియో పోస్ట్ చేసిన విషయంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. అధికారులు, సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చైర్మన్ లగేజీ డిపాజిట్ కేంద్రానికి వెళ్ళారు. పలువురు భక్తులతో లగేజీ అప్పగింత గురించి మాట్లాడారు. బ్యాగులు తీసుకుని వాటిని వ్యాన్ లో ఎక్కించి తిరుమలకు తరలించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. భక్తుల లగేజీ  కేంద్రాలు చక్కగా పనిచేస్తున్నాయని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top