వైయ‌స్ఆర్ బ‌తికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు

అమ‌దాల‌వ‌ల‌స‌లో మ‌హానేతకు ఘ‌న నివాళులు 
 

శ్రీ‌కాకుళం : దివంగత మహానేత  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బ‌తికి ఉంటే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగేది కాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌మ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. వైయ‌స్ఆర్  వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం అమ‌దాల‌వ‌ల‌స‌లో నిర్వ‌హించారు.  ఆమదాలవలస బ్రిడ్జి డౌన్ లో గల డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి  తమ్మినేని చిరంజీవి నాగ్, పార్టీ నేత‌లు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల మూడు నెలలు పాలించి ఈ వేళ రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నరంటే ఆయన పరిపాలన ద‌క్ష‌త ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపార‌ని కొనియాడారు. మ‌హానేత  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు ఆయన కుమారుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అకుంఠిత దీక్షతో కొన‌సాగిస్తున్నార‌ని, రాష్ట్రంలో పారదర్శకమైన పాలనా అందిస్తున్నార‌ని చెప్పారు.   కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామమూర్తి, జడ్పిటిసి బెండి గోవిందరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, డి సి సి బి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, పీఏసీఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు మున్సిపల్ మాజీ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సర్పంచులు దాసు నాయుడు, మొండేటి కుర్మా రావు, ఎన్ని చంద్రయ్య,, మెట్ట ఆనందరావు, చిగురుపల్లి దశరథ, గోంటి కృష్ణ, పోన్నాడ కృష్ణారావు, పొన్నాడ రాము, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, వైయస్సార్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top