అన్న క్యాంటీన్లపై టీడీపీది కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయం

పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

విజయవాడ: అనవసర విషయాలను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకొని ఇన్నాళ్లూ రాజకీయం చేశారని, మార్ఫింగ్‌ వీడియోతో ప్రభుత్వంపై నిందలు వేయాలని ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలు చేస్తే.. టీడీపీ నేతలే ఫూల్స్‌ అవుతారని ఎద్దేవా చేశారు. అన్న క్యాంటీన్లపై టీడీపీ కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయం చేస్తోందని ఫైరయ్యారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించలేదని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

Back to Top